top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీమద్భగవద్గీత - 459: 11వ అధ్., శ్లో 45 / Bhagavad-Gita - 459: Chap. 11, Ver. 45


🌹. శ్రీమద్భగవద్గీత - 459 / Bhagavad-Gita - 459 🌹


✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 45 🌴


45. అదృష్టపూర్వం హృషితోఅస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యథితమ్ మనో మే |

తదేవమే దర్శయ దేవ రూపమ్ ప్రసీద దేవేశ జగన్నివాస


🌷. తాత్పర్యం : ఇదివరకెన్నడును చూడనటువంటి ఈ విశ్వరూపమును గాంచి నేను మిగుల సంతోషించితిని. కాని అదే సమయమున మనస్సు భయముతో కలత చెందినది. కనుక ఓ దేవదేవా! జగాన్నివాసా! నా యెడ కరుణను జూపి నీ దేవదేవుని రూపమును తిరిగి నాకు చూపుము.


🌷. భాష్యము : శ్రీకృష్ణునకు ప్రియమిత్రుడైనందున అర్జునుడు అతని యెడ పూర్ణవిశ్వాసమును కలిగియుండెను. తన మిత్రుని సంపదను గాంచి ప్రియమిత్రుడైనవాడు సంతసించు రీతి, అర్జునుడు తన మిత్రుడైన శ్రీకృష్ణుడు దేవదేవుడనియు మరియు అద్భుతమైన విశ్వరూపమును చూపగలడనియు ఎరిగి మిగుల సంతసించెను. కాని అదే సమయమున ( ఆ విశ్వరూపమును గాంచిన పిమ్మట) తన విశుద్ధ ప్రేమధోరణిలో ఆ దేవదేవుని యెడ తాను పెక్కు అపరాధముల నొనర్చితినని అతడు భీతియును పొందెను. ఆ విధముగా భయమునొంద నవసరము లేకున్నను అతని మనస్సు భయముతో కలత నొందెను. తత్కారణముగా అర్జునుడు శ్రీకృష్ణుని అతని నారాయణరూపమును చూపుమని అర్థించుచున్నాడు. శ్రీకృష్ణుడు ఎట్టి రూపమునైనను దరించగలుగుటయే అందులకు కారణము. భౌతికజగము తాత్కాలికమైనట్లే ప్రస్తుత విశ్వరూపము సైతము భౌతికమును, తాత్కాలికమును అయి యున్నది. కాని వైకుంఠలోకములందు మాత్రము అతడు దివ్యమగు చతుర్భుజనారాయణ రూపమును కలిగియుండును.


ఆధ్యాత్మిక జగము నందలి అనంత సంఖ్యలో గల లోకములలో శ్రీకృష్ణుడు తన ముఖ్యాంశములచే వివిధనామములతో వసించి యుండును. అట్టి వైకుంఠలోకము లందలి వివిధ రూపములలోని ఒక్క రూపమును అర్జునుడు గాంచగోరెను. అన్ని వైకుంఠలోకములందు నారాయణ రూపము చతుర్భుజ సహితమే అయినను, వాని చతుర్భుజములలో శంఖ, చక్ర, గద, పద్మముల అమరికను బట్టి నారాయణ రూపములకు వివిధనామములు కలుగును. ఆ నారాయణ రూపములన్నియును. శ్రీకృష్ణునితో ఏకములే కనుక అర్జునుడు అతని చతుర్భుజ రూపమును గాంచ అర్థించుచున్నాడు.


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Bhagavad-Gita as It is - 459 🌹


✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj


🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 45 🌴


45. adṛṣṭa-pūrvaṁ hṛṣito ’smi dṛṣṭvā bhayena ca pravyathitaṁ mano me

tad eva me darśaya deva rūpaṁ prasīda deveśa jagan-nivāsa


🌷 Translation : After seeing this universal form, which I have never seen before, I am gladdened, but at the same time my mind is disturbed with fear. Therefore please bestow Your grace upon me and reveal again Your form as the Personality of Godhead, O Lord of lords, O abode of the universe.


🌹 Purport : Arjuna is always in confidence with Kṛṣṇa because he is a very dear friend, and as a dear friend is gladdened by his friend’s opulence, Arjuna is very joyful to see that his friend Kṛṣṇa is the Supreme Personality of Godhead and can show such a wonderful universal form. But at the same time, after seeing that universal form, he is afraid that he has committed so many offenses to Kṛṣṇa out of his unalloyed friendship. Thus his mind is disturbed out of fear, although he had no reason to fear. Arjuna therefore is asking Kṛṣṇa to show His Nārāyaṇa form, because He can assume any form. This universal form is material and temporary, as the material world is temporary. But in the Vaikuṇṭha planets He has His transcendental form with four hands as Nārāyaṇa.


There are innumerable planets in the spiritual sky, and in each of them Kṛṣṇa is present by His plenary manifestations of different names. Thus Arjuna desired to see one of the forms manifest in the Vaikuṇṭha planets. Of course in each Vaikuṇṭha planet the form of Nārāyaṇa is four-handed, but the four hands hold different arrangements of symbols – the conchshell, mace, lotus and disc. According to the different hands these four things are held in, the Nārāyaṇas are variously named. All of these forms are one with Kṛṣṇa; therefore Arjuna requests to see His four-handed feature.


🌹 🌹 🌹 🌹 🌹






1 view0 comments

Comments


bottom of page