🌹. శ్రీమద్భగవద్గీత - 462 / Bhagavad-Gita - 462 🌹
✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 48 🌴
48. న వేదయజ్ఞాధ్యయనైర్న దానైర్ న చ క్రియాభిర్న తపోభిరుగ్రై: |
ఏవంరూప: శక్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురుప్రవీర ||
🌷. తాత్పర్యం : ఓ కురుప్రవీరా! వేదాధ్యయనముచేత గాని, యజ్ఞములచేత గాని, దానములచేత గని, పుణ్యకర్మలచేత గాని, ఉగ్రమగు తపస్సులచేత గాని భౌతికజగమున ఈ రూపములలో నేను దర్శింపబడనందున నా ఈ విశ్వరూపమును నీకు పూర్వము ఎవ్వరును గాంచి యుండలేదు.
🌷. భాష్యము : ఈ సందర్భమున దివ్యదృష్టి యననేమో చక్కగా అవగతము చేసికొనవలసియున్నది. దివ్యదృష్టిని ఎవ్వరు కలిగియుందురు? దివ్యము అనగా దేవత్వమని భావము. దేవతల వలె దివ్యత్వమును సాధించనిదే ఎవ్వరును దివ్యదృష్టిని పొందలేరు.
ఇక దేవతలన యెవరు? విష్ణుభక్తులే దేవతలని వేదవాజ్మయమునందు తెలుపబడినది (విష్ణుభక్తా: స్మృతాదేవా:). అనగా విష్ణువు నందు విశ్వాశము లేని నాస్తికులు మరియు శ్రీకృష్ణుని నిరాకారరూపమునే శ్రేష్టమని భావించువారు దివ్యదృష్టిని పొందలేరు. ఒక వంక శ్రీకృష్ణుని నిరసించుచునే దివ్యదృష్టిని పొందుటకు ఎవ్వరుకినీ సాధ్యము కాదు. దివ్యులు కానిదే ఎవ్వరును దివ్యదృష్టిని పొందలేరు. అనగా దివ్యదృష్టిని కలిగినవారు అర్జునుని వలెనే విశ్వరూపమును గాంచగలరు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 462 🌹
✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj
🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 48 🌴
48. na veda-yajñādhyayanair na dānair na ca kriyābhir na tapobhir ugraiḥ
evaṁ-rūpaḥ śakya ahaṁ nṛ-loke draṣṭuṁ tvad anyena kuru-pravīra
🌷 Translation : O best of the Kuru warriors, no one before you has ever seen this universal form of Mine, for neither by studying the Vedas, nor by performing sacrifices, nor by charity, nor by pious activities, nor by severe penances can I be seen in this form in the material world.
🌹 Purport : The divine vision in this connection should be clearly understood. Who can have divine vision? Divine means godly. Unless one attains the status of divinity as a demigod, he cannot have divine vision. And what is a demigod? It is stated in the Vedic scriptures that those who are devotees of Lord Viṣṇu are demigods (viṣṇu-bhaktaḥ smṛto daivaḥ). Those who are atheistic, i.e., who do not believe in Viṣṇu, or who recognize only the impersonal part of Kṛṣṇa as the Supreme, cannot have the divine vision. It is not possible to decry Kṛṣṇa and at the same time have the divine vision. One cannot have the divine vision without becoming divine. In other words, those who have divine vision can also see like Arjuna. The Bhagavad-gītā gives the description of the universal form.
Although this description was unknown to everyone before Arjuna, now one can have some idea of the viśva-rūpa after this incident. Those who are actually divine can see the universal form of the Lord. But one cannot be divine without being a pure devotee of Kṛṣṇa. The devotees, however, who are actually in the divine nature and who have divine vision, are not very much interested in seeing the universal form of the Lord. As described in the previous verse, Arjuna desired to see the four-handed form of Lord Kṛṣṇa as Viṣṇu, and he was actually afraid of the universal form.
🌹 🌹 🌹 🌹 🌹
Comments