🌹. శ్రీమద్భగవద్గీత - 470 / Bhagavad-Gita - 470 🌹
✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -01 🌴
01. అర్జున ఉవాచ
ఏవం సతతయుక్తా యే భక్తాస్త్వాం పర్యుపాసతే |
యే చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమా: ||
🌷. తాత్పర్యం : అర్జునుడు ప్రశ్నించెను : నీ భక్తియుతసేవలో సదా యుక్తముగా నియుక్తులైనవయు మరియు అవ్యక్త నిరాకారబ్రహ్మమును ధ్యానించువారు అను ఇరువురిలో ఎవరు మిగుల పరిపూర్ణులని భావింపబడుదురు?
🌷. భాష్యము : సాకార, నిరాకార, విశ్వరూపముల గూర్చియు, పలురకములైన భక్తులు మరియు యోగుల గూర్చియు శ్రీకృష్ణభగవానుడు ఇంతవరకు వివరించెను. సాధారణముగా ఆధ్యాత్మికులు సాకారవాదులు మరియు నిరాకారవాదులను రెండు తరగతులుగా విభజించబడి యుందురు. రూపము నందు అనురక్తుడైన భక్తుడు తన సంపూర్ణశక్తిని వినియోగించి శ్రీకృష్ణభగవానుని భక్తియుతసేవలో నియుక్తుడై యుండును. కాని నిరాకారవాదియైనవాడు శ్రీకృష్ణుని ప్రత్యక్షసేవలో నిలువక అవ్యక్త నిరాకరబ్రహ్మ ధ్యానమునందు నిమగ్నుడై యుండును.
పరతత్త్వానుభూతికి గల పలువిధములైన పద్ధతులలో భక్తియోగము అత్యంత ఉత్కృష్టమైనదని ఈ అధ్యాయనమున మనకు అవగతము కాగలదు. శ్రీకృష్ణభగవానుని సన్నిహిత సాహచర్యమును వాంచించినచో మనుజుడు ఆ దేవదేవుని భక్తియుతసేవను తప్పక స్వీకరింపవలసియున్నది. ఈ భక్తియోగము అత్యంత ప్రత్యక్షమార్గమే గాక దేవదేవుని సాహచర్యమును పొందుటకు సులభతరమైన విధానమై యున్నది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 470 🌹
✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj
🌴 Chapter 12 - Devotional Service - 01 🌴
01. arjuna uvāca
evaṁ satata-yuktā ye bhaktās tvāṁ paryupāsate
ye cāpy akṣaram avyaktaṁ teṣāṁ ke yoga-vittamāḥ
🌷 Translation : Arjuna inquired: Which are considered to be more perfect, those who are always properly engaged in Your devotional service or those who worship the impersonal Brahman, the unmanifested?
🌹 Purport : Kṛṣṇa has now explained about the personal, the impersonal and the universal and has described all kinds of devotees and yogīs. Generally, the transcendentalists can be divided into two classes. One is the impersonalist, and the other is the personalist. The personalist devotee engages himself with all energy in the service of the Supreme Lord. The impersonalist also engages himself, not directly in the service of Kṛṣṇa but in meditation on the impersonal Brahman, the unmanifested. We find in this chapter that of the different processes for realization of the Absolute Truth, bhakti-yoga, devotional service, is the highest. If one at all desires to have the association of the Supreme Personality of Godhead, then he must take to devotional service. Those who worship the Supreme Lord directly by devotional service are called personalists. Those who engage themselves in meditation on the impersonal Brahman are called impersonalists.
Arjuna is here questioning which position is better. There are different ways to realize the Absolute Truth, but Kṛṣṇa indicates in this chapter that bhakti-yoga, or devotional service to Him, is the highest of all. It is the most direct, and it is the easiest means for association with the Godhead. In the Second Chapter of Bhagavad-gītā, the Supreme Lord explained that a living entity is not the material body; he is a spiritual spark. And the Absolute Truth is the spiritual whole. In the Seventh Chapter He spoke of the living entity as being part and parcel of the supreme whole and recommended that he transfer his attention fully to the whole. So in practically every chapter the conclusion has been that one should be attached to the personal form of Kṛṣṇa, for that is the highest spiritual realization.
🌹 🌹 🌹 🌹 🌹
Comments