🌹. శ్రీమద్భగవద్గీత - 471 / Bhagavad-Gita - 471 🌹
✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -02 🌴
02. శ్రీ భగవానువాచ
మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే |
శ్రద్ధయా పరయోపేతాస్తే మే యుక్తతమా మతా: ||
🌷. తాత్పర్యం : శ్రీకృష్ణభగవానుడు పలికెను: నా స్వీయరూపము నందు మనస్సును లగ్నము చేసి దివ్యమును, ఘనమును అగు శ్రద్ధతో సదా నా అర్చనమునందు నియుక్తులైనవారు అత్యంత పరిపూర్ణములని నేను భావింతును.
🌷. భాష్యము : అర్జునుని ప్రశ్నకు సమాధానముగా శ్రీకృష్ణభగవానుడు తన స్వీయరూపమును ధ్యానించుచు శ్రద్ధాభక్తులను గూడి తనను పూజించువాడు యోగము నందు పరిపూర్ణుడని స్పష్టముగా పలుకుచున్నాడు. సర్వము కృష్ణుని కొరకే ఒనరింపబడుచున్నందున అట్టి కృష్ణభక్తిభావనలో నున్నవానికి ఎట్టి భౌతికకర్మలను ఉండవు. అటువంటి కృష్ణభక్తిరసభావనలో భక్తుడు సంతతమగ్నుడై యుండును.
కొన్నిమార్లు అతడు జపమును గావించును. కొన్నిమార్లు కృష్ణుని గూర్చిన శ్రవణము లేదా పఠనమును కొనసాగించును. మరికొన్నిసార్లు కృష్ణునికై ప్రసాదమును తయారు చేయును. ఇంకొన్నిమార్లు కృష్ణుని నిమిత్తమై అవసరమైనదేదియో ఖరీదు చేయుటకు అంగడికేగును. ఇంకను మందిరమును శుభ్రము చేయుట, భగవానుని భోజనపాత్రులను కడుగుట వంటి కార్యముల నొనరించును. ఈ విధముగా ఆతడు కృష్ణపరకర్మలకు అంకితము కాకుండా క్షణకాలమును వృథాచేయడు. అటువంటి కర్మ సంపూర్ణముగా సమాధిగతమై యుండును.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 471 🌹
✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj
🌴 Chapter 12 - Devotional Service - 02 🌴
02. śrī-bhagavān uvāca
mayy āveśya mano ye māṁ nitya-yuktā upāsate
śraddhayā parayopetās te me yukta-tamā matāḥ
🌷 Translation : The Supreme Personality of Godhead said: Those who fix their minds on My personal form and are always engaged in worshiping Me with great and transcendental faith are considered by Me to be most perfect.
🌹 Purport : In answer to Arjuna’s question, Kṛṣṇa clearly says that he who concentrates upon His personal form and who worships Him with faith and devotion is to be considered most perfect in yoga. For one in such Kṛṣṇa consciousness there are no material activities, because everything is done for Kṛṣṇa.
A pure devotee is constantly engaged. Sometimes he chants, sometimes he hears or reads books about Kṛṣṇa, or sometimes he cooks prasādam or goes to the marketplace to purchase something for Kṛṣṇa, or sometimes he washes the temple or the dishes – whatever he does, he does not let a single moment pass without devoting his activities to Kṛṣṇa. Such action is in full samādhi.
🌹 🌹 🌹 🌹 🌹
Comments