top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీమద్భగవద్గీత - 477: 12వ అధ్., శ్లో 08 / Bhagavad-Gita - 477: Chap. 12, Ver. 08



🌹. శ్రీమద్భగవద్గీత - 477 / Bhagavad-Gita - 477 🌹


✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -08 🌴


08. మయ్యేమ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ |

నివసిష్యసి మయ్యేవ అత ఊర్థ్వం న సంశయ: ||


🌷. తాత్పర్యం : దేవదేవుడైన నా యందే నీ మనస్సును స్థిరముగా నిలుపుము మరియు నీ బుద్ధినంతయు నా యందే నియుక్తము గావింపుము. ఈ విధముగా సదా నా యందే నీవు నిస్సంశయముగా నివసింతువు.


🌷. భాష్యము : : శ్రీకృష్ణభగవానుని భక్తియుతసేవలో నియుక్తుడైనవాడు ఆ భగవానునితో ప్రత్యక్ష సంబధమున జీవించును. తత్కారణముగా తొలినుండియే అతని స్థితి ఆధ్యాత్మికమై యుండుననుటలో ఎట్టి సందేహము లేదు. వాస్తవమునకు భక్తుడెన్నడును భౌతికపరధిలో జీవింపడు. అతడు సదా కృష్ణుని యందే నిలిచియుండును. కృష్ణనామమునకు మరియు కృష్ణునకు భేదములేదు కనుక భక్తుడు కృష్ణుని నామమును ఉచ్చరించినంతనే కృష్ణుడు మరియు అతని అంతరంగశక్తి భక్తుని నాలుకపై నాట్యము చేయుదురు.


భక్తుడు వివిధ పదార్థములను నైవేద్యముగా అర్పించినపుడు శ్రీకృష్ణుడు ప్రత్యక్షముగా వాటిని స్వీకరించును. పిదప భక్తుడు ఆ ప్రసాదమును గొని కృష్ణభావనలో తన్మయుడగును. భగవద్గీత యందు మరియు ఇతర వేదవాజ్మయమునందు ఈ పద్ధతి వివరింపబడియున్నను ఇట్టి భక్తియుత సేవాకార్యమున నియుక్తుడు కానివాడు అదియెట్లు సంభవమనెడి విషయమును అవగతము చేసికొనజాలడు.


🌹🌹🌹🌹🌹






🌹 Bhagavad-Gita as It is - 477 🌹


✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj


🌴 Chapter 12 - Devotional Service - 08 🌴


08. mayy eva mana ādhatsva mayi buddhiṁ niveśaya

nivasiṣyasi mayy eva ata ūrdhvaṁ na saṁśayaḥ


🌷 Translation : Just fix your mind upon Me, the Supreme Personality of Godhead, and engage all your intelligence in Me. Thus you will live in Me always, without a doubt.


🌹 Purport : One who is engaged in Lord Kṛṣṇa’s devotional service lives in a direct relationship with the Supreme Lord, so there is no doubt that his position is transcendental from the very beginning. A devotee does not live on the material plane – he lives in Kṛṣṇa.


The holy name of the Lord and the Lord are nondifferent; therefore when a devotee chants Hare Kṛṣṇa, Kṛṣṇa and His internal potency are dancing on the tongue of the devotee. When he offers Kṛṣṇa food, Kṛṣṇa directly accepts these eatables, and the devotee becomes Kṛṣṇa-ized by eating the remnants. One who does not engage in such service cannot understand how this is so, although this is a process recommended in the Bhagavad-gītā and in other Vedic literatures.


🌹 🌹 🌹 🌹 🌹





1 view0 comments

Comments


bottom of page