top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీమద్భగవద్గీత - 482: 12వ అధ్., శ్లో 13 / Bhagavad-Gita - 482: Chap. 12, Ver. 13



🌹. శ్రీమద్భగవద్గీత - 482 / Bhagavad-Gita - 482 🌹


✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 12వ అధ్యాయము - భక్తియోగము -13 🌴


13. అద్వేష్టా సర్వభూతానాం మైత్ర: కరుణ ఏవ చ |

నిర్మమో నిరహంకార: సమదుఃఖసుఖ: క్షమీ ||


🌷. తాత్పర్యం : ద్వేషమనునది లేకుండ సర్వజీవుల యెడ మైత్రిని కలిగినవాడును, మమత్వము లేనివాడును, మిథ్యాహంకార రహితుడును, సుఖదుఃఖములు రెండింటి యందును సమభావము కలవాడును, క్షమాగుణము కలవాడును,


🌷. భాష్యము : విశుద్ధ భక్తియుత విషయమునకే మరల అరుదెంచి శ్రీకృష్ణభగవానుడు శుద్దభక్తుని దివ్యలక్షణములను ఈ రెండు శ్లోకములందు వివరించుచున్నాడు. శుద్ధభక్తుడు ఎటువంటి పరిస్థితి యందును ఎన్నడు కలతనొందడు. అతడు ఎవ్వరిని ద్వేషింపడు. అలాగుననే శత్రువుకు శత్రువు కావలెననియు అతడు తలపడు. పైగా అతడు “నా పూర్వపాపకర్మల కారణముగా ఇతడు నా యెడ శత్రువుగా వర్తించుచున్నాడు. కావున ఎదిరించుట కన్నను అనుభవించుటయే మేలు” అని తలపోయును.


ఈ విషయమే “తత్తే(నుకంపాం సుసమీక్షమాణో భుంజాన ఏవాత్మకృతం విపాకం” అను శ్లోకము ద్వారా శ్రీమద్భాగవతమున (10.14.8) తెలుపబడినది. అనగా భక్తుడు కలతకు గురియైనప్పుడు లేదా కష్టము సంప్రాప్తించి నప్పుడు దానిని తనపై భగవానుడు చూపు కరుణగా భావించును. “నా పూర్వపాపము వలన ఇప్పుడు అనుభవించు కష్టము కన్నను అత్యంత దుర్భరమైన కష్టమును నేను అనుభవించ వలసి యున్నది. కాని ఆ భగవానుని కరుణ చేతనే నేను పొందవలసిన శిక్షనంతటిని పొందక, ఆ శిక్షలో కొద్దిభాగమును మాత్రమే నేను పొందుచున్నాను” అని ఆ భక్తుడు తలపోయును. కనుకనే పలు కష్టపరిస్థితుల యందైనను భక్తుడు సదా శాంతుడును, కలతనొందనివాడును, ఓర్పు కలిగినవాడును అయి యుండును. అట్టి భక్తుడు తన శత్రువుతో సహా ప్రతివారి యెడను సదా కరుణను కలిగియుండును.


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Bhagavad-Gita as It is - 482 🌹


✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj


🌴 Chapter 12 - Devotional Service - 13 🌴


13. adveṣṭā sarva-bhūtānāṁ maitraḥ karuṇa eva ca

nirmamo nirahaṅkāraḥ sama-duḥkha-sukhaḥ kṣamī


🌷 Translation : One who is not envious but is a kind friend to all living entities, who does not think himself a proprietor and is free from false ego, who is equal in both happiness and distress, who is tolerant,


🌹 Purport : Coming again to the point of pure devotional service, the Lord is describing the transcendental qualifications of a pure devotee in these two verses. A pure devotee is never disturbed in any circumstances. Nor is he envious of anyone. Nor does a devotee become his enemy’s enemy; he thinks, “This person is acting as my enemy due to my own past misdeeds. So it is better to suffer than to protest.”


In the Śrīmad-Bhāgavatam (10.14.8) it is stated: tat te ’nukampāṁ su-samīkṣamāṇo bhuñjāna evātma-kṛtaṁ vipākam. Whenever a devotee is in distress or has fallen into difficulty, he thinks that it is the Lord’s mercy upon him. He thinks, “Thanks to my past misdeeds I should suffer far, far greater than I am suffering now. So it is by the mercy of the Supreme Lord that I am not getting all the punishment I am due. I am just getting a little, by the mercy of the Supreme Personality of Godhead.” Therefore he is always calm, quiet and patient, despite many distressful conditions.


🌹 🌹 🌹 🌹 🌹


1 view0 comments

Kommentare


bottom of page