top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీమద్భగవద్గీత - 484: 12వ అధ్., శ్లో 15 / Bhagavad-Gita - 484: Chap. 12, Ver. 15




🌹. శ్రీమద్భగవద్గీత - 484 / Bhagavad-Gita - 484 🌹

✍️. శ్రీ ప్రభుపాద,

📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -15 🌴


15. యస్మాన్నోద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చ య: |

హర్షామర్షభయోద్వేగైర్ముక్తో య: స చ మే ప్రియ: ||


🌷. తాత్పర్యం : ఎవ్వరికినీ కష్టమును కలిగించనివాడును, ఎవరిచేతను కలతకు గురికానివాడును, సుఖదుఃఖములందు మరియు భయోద్వేగములందును సమచిత్తునిగా నుండువాడును అగు మనుజుడు నాకు మిక్కిలి ప్రియుడు.

🌷. భాష్యము : భక్తుని కొన్ని లక్షణములు ఇంకను ఇచ్చట వర్ణింపబడినవి. అట్టి భక్తునిచే ఎవ్వరును కష్టమునకు గాని, వేదనకు గాని, భయమునకు గాని, అసంతుష్టికి గాని గురికారు. భక్తుడు సర్వుల యెడ కరుణను కలిగియుండుటచే ఇతరులకు వేదన, కలత కలుగురీతిలో ఎన్నడును వర్తించడు. అదే సమయమున ఇతరులు తనకు వేదనను కలిగింప యత్నించినను అతడు కలతకు గురికాకుండును. భగవానుని కరుణచే అతడు ఎట్టి బాహ్యక్షోభలచే కలత నొందకుండునట్లుగా అభ్యాసము కావించి యుండును.

వాస్తవమునకు భక్తుడు కృష్ణభక్తిరసభావనలో రమించుచు భక్తియుతసేవ యందు నియుక్తుడై యున్నందున భౌతికపరిస్థితులు అతనిని కలతను కలిగింపలేవు. సాధారణముగా భౌతికభావన కలిగిన మనుజుడు తన ఇంద్రియప్రీతికి ఏదేని లభించినచో అత్యంత ఆనందమును పొందును. కాని తన వద్ద లేనివి ఇతరులు తమ ఇంద్రియప్రీత్యర్థము కలిగియున్నచో అతడు దుఃఖమును, అసూయను పొందును. శత్రువు నుండి ఏదేని ఎదురుదాడికి అవకాశమున్నచో భయస్థుడగును మరియు ఏదేని ఒక కార్యమును విజయవంతముగా నిర్వహింపలేకపోయినచో విషణ్ణుడగును. ఇటువంటి కలతలకు మరియు సంక్షోభములకు సదా అతీతుడై యుండెడి భక్తుడు శ్రీకృష్ణునకు మిగుల ప్రియతముడు.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 484 🌹

✍️ Sri Prabhupada,

📚 Prasad Bharadwaj


🌴 Chapter 12 - Devotional Service - 15 🌴


15. yasmān nodvijate loko lokān nodvijate ca yaḥ

harṣāmarṣa-bhayodvegair mukto yaḥ sa ca me priyaḥ


🌷 Translation : He by whom no one is put into difficulty and who is not disturbed by anyone, who is equipoised in happiness and distress, fear and anxiety, is very dear to Me.

🌹 Purport : A few of a devotee’s qualifications are further being described. No one is put into difficulty, anxiety, fearfulness or dissatisfaction by such a devotee. Since a devotee is kind to everyone, he does not act in such a way as to put others into anxiety. At the same time, if others try to put a devotee into anxiety, he is not disturbed. It is by the grace of the Lord that he is so practiced that he is not disturbed by any outward disturbance. Actually because a devotee is always engrossed in Kṛṣṇa consciousness and engaged in devotional service, such material circumstances cannot move him.

Generally a materialistic person becomes very happy when there is something for his sense gratification and his body, but when he sees that others have something for their sense gratification and he hasn’t, he is sorry and envious. When he is expecting some retaliation from an enemy, he is in a state of fear, and when he cannot successfully execute something he becomes dejected. A devotee who is always transcendental to all these disturbances is very dear to Kṛṣṇa.

🌹 🌹 🌹 🌹 🌹

1 view0 comments

Comments


bottom of page