top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీమద్భగవద్గీత - 485: 12వ అధ్., శ్లో 16 / Bhagavad-Gita - 485: Chap. 12, Ver. 16



🌹. శ్రీమద్భగవద్గీత - 485 / Bhagavad-Gita - 485 🌹


✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -16 🌴


16. యస్మాన్నోద్విజతే లోకో లోకాన్నోద్విజతే చ య: |

హర్షామర్షభయోద్వేగైర్ముక్తో య: స చ మే ప్రియ: ||


🌷. తాత్పర్యం : ఎవ్వరికినీ కష్టమును కలిగించనివాడును, ఎవరిచేతను కలతకు గురికానివాడును, సుఖదుఃఖములందు మరియు భయోద్వేగములందును సమచిత్తునిగా నుండువాడును అగు మనుజుడు నాకు మిక్కిలి ప్రియుడు.


🌷. భాష్యము : భక్తుని కొన్ని లక్షణములు ఇంకను ఇచ్చట వర్ణింపబడినవి. అట్టి భక్తునిచే ఎవ్వరును కష్టమునకు గాని, వేదనకు గాని, భయమునకు గాని, అసంతుష్టికి గాని గురికారు. భక్తుడు సర్వుల యెడ కరుణను కలిగియుండుటచే ఇతరులకు వేదన, కలత కలుగురీతిలో ఎన్నడును వర్తించడు. అదే సమయమున ఇతరులు తనకు వేదనను కలిగింప యత్నించినను అతడు కలతకు గురికాకుండును. భగవానుని కరుణచే అతడు ఎట్టి బాహ్యక్షోభలచే కలత నొందకుండునట్లుగా అభ్యాసము కావించియుండును.


వాస్తవమునకు భక్తుడు కృష్ణభక్తిరసభావనలో రమించుచు భక్తియుతసేవ యందు నియుక్తుడై యున్నందున భౌతికపరిస్థితులు అతనిని కలతను కలిగింపలేవు. సాధారణముగా భౌతికభావన కలిగిన మనుజుడు తన ఇంద్రియప్రీతికి ఏదేని లభించినచో అత్యంత ఆనందమును పొందును. కాని తన వద్ద లేనివి ఇతరులు తమ ఇంద్రియప్రీత్యర్థము కలిగియున్నచో అతడు దుఃఖమును, అసూయను పొందును. శత్రువు నుండి ఏదేని ఎదురుదాడికి అవకాశమున్నచో భయస్థుడగును మరియు ఏదేని ఒక కార్యమును విజయవంతముగా నిర్వహింపలేకపోయినచో విషణ్ణుడగును. ఇటువంటి కలతలకు మరియు సంక్షోభములకు సదా అతీతుడై యుండెడి భక్తుడు శ్రీకృష్ణునకు మిగుల ప్రియతముడు.


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Bhagavad-Gita as It is - 485 🌹


✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj


🌴 Chapter 12 - Devotional Service - 16 🌴


16. anapekṣaḥ śucir dakṣa udāsīno gata-vyathaḥ

sarvārambha-parityāgī yo mad-bhaktaḥ sa me priyaḥ


🌷 Translation : My devotee who is not dependent on the ordinary course of activities, who is pure, expert, without cares, free from all pains, and not striving for some result, is very dear to Me.


🌹 Purport : Money may be offered to a devotee, but he should not struggle to acquire it. If automatically, by the grace of the Supreme, money comes to him, he is not agitated. Naturally a devotee takes a bath at least twice in a day and rises early in the morning for devotional service. Thus he is naturally clean both inwardly and outwardly. A devotee is always expert because he fully knows the essence of all activities of life and he is convinced of the authoritative scriptures. A devotee never takes the part of a particular party; therefore he is carefree.


He is never pained, because he is free from all designations; he knows that his body is a designation, so if there are some bodily pains, he is free. The pure devotee does not endeavor for anything which is against the principles of devotional service. For example, constructing a big building requires great energy, and a devotee does not take to such business if it does not benefit him by advancing his devotional service. He may construct a temple for the Lord, and for that he may take all kinds of anxiety, but he does not construct a big house for his personal relations.


🌹 🌹 🌹 🌹 🌹




1 view0 comments

Comments


bottom of page