🌹. శ్రీమద్భగవద్గీత - 491 / Bhagavad-Gita - 491 🌹
✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 02 🌴
02. శ్రీ భగవానువాచ
ఇదం శరీరం కౌన్తేయ క్షేత్రమిత్యభిదీయతే |
ఏతద్ యో వేత్తి తం ప్రాహు: క్షేత్రజ్ఞ ఇతి తద్విద: ||
🌷. తాత్పర్యం : శ్రీకృష్ణభగవానుడు పలికెను; ఓ కౌంతేయా! ఈ దేహము క్షేత్రమనియు మరియు ఈ దేహము నెరిగినవాడు క్షేత్రజ్ఞుడనియు పిలువబడును.
🌷. భాష్యము : ఈ దేహము క్షేత్రముగా పిలివబడుననియు, దేహము నెరిగినవాడు క్షేత్రజ్ఞునిగా పిలువ బడుననియు శ్రీకృష్ణభగవానుడు పలికెను. ఈ దేహము బద్ధజీవునకు కర్మక్షేత్రము. అతడు భౌతికస్థితిలో చిక్కుకొని ప్రకృతిపై అధిపత్యమును చెలాయించవలెనని యత్నించును. ఆ విధముగా ప్రకృతిపై అధిపత్యము వహింపగలిగిన తన సామర్థ్యము ననుసరించి అతడు కర్మక్షేత్రమును పొందును. ఆ కర్మక్షేత్రమే దేహము. ఇక దేహమనగా ఇంద్రియములను కూడినట్టిది. బద్ధజీవుడు ఇంద్రియసుఖమును అనుభవింపగోరును. ఆ ఇంద్రియసుఖము అనుభవించుటకు గల సామర్థ్యము ననుసరించి అతనికి ఒక దేహము(కర్మ క్షేత్రము) ఒసగబడును. కనుకనే దేహము బద్ధజీవుని కర్మక్షేత్రమని పిలువబడును.
అట్టి దేహము నెరిగినవాడు క్షేత్రజ్ఞుడని పిలువబడును. క్షేత్రమునకు మరియు క్షేత్రజ్ఞునకు నడుమగల భేదమును, అనగా దేహమునకు మరియు దేహము నెరిగినవానికి నడుమ భేదమును అవగాహన చేసికొనుట కష్టమైన విషయము కాదు. దేహమునకు యజమాని “క్షేత్రజ్ఞుడు”. నేను సుఖిని, నేను పురుషుడను, నేను స్త్రీని, నేను శునకమును, నేను మార్జాలమును అను భావనల ఆ క్షేత్రజ్ఞుని ఉపాధులు మాత్రమే. కాని వాస్తవమునకు క్షేత్రజ్ఞుడు దేహమునకు అన్యుడు. దేహమునకు వస్త్రమువంటి పెక్కింటిని మనము ఉపయోగించినను వాటికన్నను మనము అన్యులమని స్పష్టముగా నెరుగగలము. అనగా దేహమునకు యజమాని (నేను లేదా నీవు లేదా ఎవరైనను) క్షేత్రజ్ఞుడనియు (కర్మక్షేత్రము నెరిగినవాడు) మరియు దేహము క్షేత్రమనియు (కర్మ క్షేత్రమని) పిలువబడును.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 491 🌹
✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj
🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 02 🌴
02. śrī-bhagavān uvāca
idaṁ śarīraṁ kaunteya kṣetram ity abhidhīyate
etad yo vetti taṁ prāhuḥ kṣetra-jña iti tad-vidaḥ
🌷 Translation : The Supreme Personality of Godhead said: This body, O son of Kuntī, is called the field, and one who knows this body is called the knower of the field.
🌹 Purport : When he inquired about all these, Kṛṣṇa said that this body is called the field and that one who knows this body is called the knower of the field. This body is the field of activity for the conditioned soul. The conditioned soul is entrapped in material existence, and he attempts to lord it over material nature. And so, according to his capacity to dominate material nature, he gets a field of activity. That field of activity is the body. And what is the body? The body is made of senses. The conditioned soul wants to enjoy sense gratification, and, according to his capacity to enjoy sense gratification, he is offered a body, or field of activity.
Therefore the body is called kṣetra, or the field of activity for the conditioned soul. Now, the person, who should not identify himself with the body, is called kṣetra-jña, the knower of the field. It is not very difficult to understand the difference between the field and its knower, the body and the knower of the body. Although we may use many articles – our clothes, etc. – we know that we are different from the things used. Similarly, we also understand by a little contemplation that we are different from the body. I or you or anyone else who owns the body is called kṣetra-jña, the knower of the field of activities, and the body is called kṣetra, the field of activities itself.
🌹 🌹 🌹 🌹 🌹
Comentários