🌹. శ్రీమద్భగవద్గీత - 493 / Bhagavad-Gita - 493 🌹
✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 04 🌴
04. తత్ క్షేత్రం యచ్చ యాదృక్చ యద్వికారి యతశ్చ యత్ |
స చ యో యత్ప్రభావశ్చ తత్ సమాసేన మే శృణు ||
🌷. తాత్పర్యం : ఇప్పుడు క్షేత్రమును, అది నిర్మించబడిన విధానము, దాని యందలి మార్పులను, దేని నుండి అది ఉద్భవించినదనెడి విషయమును, క్షేత్రజ్ఞుడు మరియు అతని ప్రభావములను గూర్చిన నా సంక్షేపవర్ణనను ఆలకింపుము.
🌷. భాష్యము : కర్మక్షేత్రము మరియు కర్మక్షేత్రపు జ్ఞాతయైన క్షేత్రజ్ఞుని సహజస్థితిని శ్రీకృష్ణభగవానుడు ఇచ్చట వర్ణించుచున్నాడు. ఏ విధముగా ఈ దేహము నిర్మింపబడుచున్నది, ఏ మూలకములచే ఇది ఏర్పడుచున్నది, ఎవని నియామకమున ఇది పనిచేయుచున్నది, దీనియందలి మార్పులు ఎట్లు కలుగుచున్నవి, ఆ మార్పులు ఎచ్చట నుండి కలుగుచున్నవి, అట్టి మార్పులకు కారణము మరియు హేతువులేవి, ఆత్మ యొక్క చరమగమ్యమేది, ఆత్మ యొక్క నిజరూపమేది యనెడి విషయములను ప్రతియొక్కరు తెలిసికొనవలసియున్నది.
అంతియే గాక జీవాత్మకును పరమాత్మకును నడుమగల భేదము, వారి ప్రభావములు, సామర్థ్యములు కూడ మనుజుడు ఎరిగియుండవలెను. అందులకు శ్రీకృష్ణభగవానుడు ప్రత్యక్షముగా ఉపదేశించిన ఈ భగవద్గీతను అవగతము చేసికొనిన చాలును. అంతట సర్వము సుస్పష్టము కాగలదు. కాని ఎల్లదేహముల యందున్న భగవానుడు జీవాత్మతో సమానుడని ఎవ్వరును భావింపరాదు. అట్టి భావనము శక్తిమంతుడైనవానిని శక్తిహీనునితో సమానము చేయుటయే కాగలదు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 493 🌹
✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj
🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 04 🌴
04. tat kṣetraṁ yac ca yādṛk ca yad-vikāri yataś ca yat
sa ca yo yat-prabhāvaś ca tat samāsena me śṛṇu
🌷 Translation : Now please hear My brief description of this field of activity and how it is constituted, what its changes are, whence it is produced, who that knower of the field of activities is, and what his influences are.
🌹 Purport : The Lord is describing the field of activities and the knower of the field of activities in their constitutional positions. One has to know how this body is constituted, the materials of which this body is made, under whose control this body is working, how the changes are taking place, wherefrom the changes are coming, what the causes are, what the reasons are, what the ultimate goal of the individual soul is, and what the actual form of the individual soul is.
One should also know the distinction between the individual living soul and the Supersoul, their different influences, their potentials, etc. One just has to understand this Bhagavad-gītā directly from the description given by the Supreme Personality of Godhead, and all this will be clarified. But one should be careful not to consider the Supreme Personality of Godhead in every body to be one with the individual soul, the jīva. This is something like equating the potent and the impotent.
🌹 🌹 🌹 🌹 🌹
Comentarios