🌹. శ్రీమద్భగవద్గీత - 505 / Bhagavad-Gita - 505 🌹
✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 16 🌴
16. బహిరన్తశ్చ భూతానామచరం చరమేవ చ |
సూక్ష్మత్వాత్తదవిజ్ఞేయం దూరస్థం చాన్తికే చ తత్ ||
🌷. తాత్పర్యం : పరమాత్ముడు స్థావర, జంగములైన సర్వజీవుల అంతర్భాహ్యములలో నిలిచియుండును. సూక్ష్మత్వకారణముగా అతడు భౌతికేంద్రియములకు అగోచరుడును, ఆగ్రాహ్యుడును అయియున్నాడు. అతిదూరమున ఉన్నను అతడు సర్వులకు సమీపముననే ఉండును.
🌷. భాష్యము : పరమపురుషుడైన నారాయణుడు ప్రతిజీవి యొక్క అంతర్భాహ్యములలో నిలిచియుండునని వేదవాజ్మయము ద్వారా మనము తెలిసికొనగలము. అతడు భౌతిక, ఆధ్యాత్మిక జగత్తులు రెండింటి యందును నిలిచియున్నాడు. అతడు అత్యంత దూరమున ఉన్నను మనకు సమీపముననే యుండును. ఇవియన్నియును వేదవచనములు. ఈ విషయమున కఠోపనిషత్తు (1.2.21) “ఆసీనో దూరం వ్రజతి శయానో యాతి సర్వత:” అని పలికినది.
దివ్యానందమగ్నుడైన ఆ పరమపురుషుడు ఎట్లు తన ఐశ్వర్యముల ననుభవించునో మనము అవగతము చేసికొనజాలము. ఈ భౌతికేంద్రియములతో ఈ విషయమును గాంచుట గాని, అవగతము చేసికొనుట గాని చేయజాలము. కనుకనే అతనిని తెలియుట యందు మన భౌతిక మనో, ఇంద్రియములు పనిచేయజాలవని వేదములు పలుకుచున్నవి. కాని కృష్ణభక్తిరసభావనలో భక్తియోగమును అవలంబించుచు మనస్సును, ఇంద్రియములను పవితమొనర్చుకొనినవాడు అతనిని నిత్యము గాంచగలడు. శ్రీకృష్ణభగవానుని యెడ ప్రేమను వృద్ధిగావించుకొనినవాడు అతనిని నిర్విరామముగా నిత్యము గాంచగలడని బ్రహ్మసంహిత యందు నిర్ధారింపబడినది. భక్తియుక్తసేవ ద్వారానే అతడి దర్శింపబడి అవగతమగునని భగవద్గీత (11.54) యందును ఈ విషయము నిర్ధారింపబడినది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 505 🌹
✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj
🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 16 🌴
16. bahir antaś ca bhūtānām acaraṁ caram eva ca
sūkṣmatvāt tad avijñeyaṁ dūra-sthaṁ cāntike ca tat
🌷 Translation : The Supreme Truth exists outside and inside of all living beings, the moving and the nonmoving. Because He is subtle, He is beyond the power of the material senses to see or to know. Although far, far away, He is also near to all.
🌹 Purport : In Vedic literature we understand that Nārāyaṇa, the Supreme Person, is residing both outside and inside of every living entity. He is present in both the spiritual and material worlds. Although He is far, far away, still He is near to us. These are the statements of Vedic literature. Āsīno dūraṁ vrajati śayāno yāti sarvataḥ (Kaṭha Upaniṣad 1.2.21). And because He is always engaged in transcendental bliss, we cannot understand how He is enjoying His full opulence. We cannot see or understand with these material senses.
Therefore in the Vedic language it is said that to understand Him our material mind and senses cannot act. But one who has purified his mind and senses by practicing Kṛṣṇa consciousness in devotional service can see Him constantly. It is confirmed in Brahma-saṁhitā that the devotee who has developed love for the Supreme God can see Him always, without cessation. And it is confirmed in Bhagavad-gītā (11.54) that He can be seen and understood only by devotional service. Bhaktyā tv ananyayā śakyaḥ.
🌹 🌹 🌹 🌹 🌹
Comments