top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీమద్భగవద్గీత - 510: 13వ అధ్., శ్లో 21 / Bhagavad-Gita - 510: Chap. 13, Ver. 21



🌹. శ్రీమద్భగవద్గీత - 510 / Bhagavad-Gita - 510 🌹


✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 21 🌴


21. కార్యకారణకర్తృత్వే హేతు: ప్రకృతిరుచ్యతే |

పురుష: సుఖదుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే ||


🌷. తాత్పర్యం : భౌతిక కార్య, కారణములన్నింటికిని ప్రక్తుతియే హేతువనియు, జగమునందలి పలు సుఖదుఃఖానుభవములకు జీవుడే కారణమనియు చెప్పబడుచున్నది.


🌷. భాష్యము : జీవుల వివిదేంద్రియముల వ్యక్తీకరణకు భౌతికప్రకృతియే హేతువు. ఎనుబదినాలుగులక్షల జీవారాసులన్నియును ప్రకృతి నుండియే ఉద్భవించినవి. అవియన్నియును వాస్తవమునకు భిన్నదేహములందు జీవింపగోరు జీవుని యొక్క వివిధములైన ఇంద్రియకోరికల వలన కలుగుచున్నవి. అట్టి వివిధ దేహములందు అతడు ప్రవేశింపజేయబడినంత వివిధములైన సుఖదుఃఖముల ననుభవించు చుండును.


అతడు అనుభవించు ఆ సుఖదుఃఖములు అతని దేహము వలననే సంప్రాప్తించి యుండును గాని తన వలనకాదు. అనగా నిజస్థితిలో జీవుడు ఆనందమయుడని పలుకుటలో ఎట్టి సందేహమును లేదు. కనుక అట్టి నిజస్థితియే అతని యథార్థస్థితి. కాని ప్రకృతిపై అధికారము చెలాయించ వలెనను కోరికను కలిగియుండుటచే అతడు ఈ భౌతిక జగమునకు చేరియున్నాడు. అట్టి భావనలు ఆధ్యాత్మిక జగత్తు నందుండవు. అది సదా అట్టి వానినుండి దూరమై, పవిత్రమై యుండును.


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Bhagavad-Gita as It is - 510 🌹


✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj


🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 21 🌴


21. kārya-kāraṇa-kartṛtve hetuḥ prakṛtir ucyate

puruṣaḥ sukha-duḥkhānāṁ bhoktṛtve hetur ucyate


🌷 Translation : Nature is said to be the cause of all material causes and effects, whereas the living entity is the cause of the various sufferings and enjoyments in this world.


🌹 Purport : The different manifestations of body and senses among the living entities are due to material nature. There are 8,400,000 different species of life, and these varieties are creations of the material nature. They arise from the different sensual pleasures of the living entity, who thus desires to live in this body or that.


When he is put into different bodies, he enjoys different kinds of happiness and distress. His material happiness and distress are due to his body, and not to himself as he is. In his original state there is no doubt of enjoyment; therefore that is his real state. Because of the desire to lord it over material nature, he is in the material world. In the spiritual world there is no such thing. The spiritual world is pure, but in the material world everyone is struggling hard to acquire different kinds of pleasures for the body.


🌹 🌹 🌹 🌹 🌹





4 views0 comments

Comments


bottom of page