🌹. శ్రీమద్భగవద్గీత - 512 / Bhagavad-Gita - 512 🌹
✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 23 🌴
23. ఉపద్రష్టానుమన్తా చ భర్తా భోక్తా మహేశ్వర: |
పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మేన్ పురుష: పర: ||
🌷. తాత్పర్యం : అయినను ఈ దేహమునందు దివ్యప్రభువును, దివ్యయజమానుడును, పర్యవేక్షకుడును, అంగీకరించు వాడును, పరమాత్మగా తెలియబడు వాడును అగు దివ్యభోక్త మరియొకడు కలడు.
🌷. భాష్యము : జీవాత్మతో సదా కూడియుండు పరమాత్ముడు దేవదేవుడైన శ్రీకృష్ణుని ప్రాతినిధ్యమని ఇచ్చట పేర్కొనబడినది. అట్టి పరమాత్మ ఎన్నడును సామాన్యజీవుడు కాడు. అద్వైతులైన వారు దేహము నెరిగిన క్షేత్రజ్ఞుడు ఒక్కడేయని భావించుట వలన ఆత్మ మరియు పరమాత్మల నడుమ భేదము లేదని తలతురు. కనుక సత్యమును వివరించుట కొరకే శ్రీకృష్ణభగవానుడు తాను పరమాత్మ రూపమున ప్రతిదేహమునందు ప్రాతినిధ్యము వహించుచున్నానని తెలియజేయుచున్నాడు. అతడు సదా జీవాత్మకు భిన్నుడైనవాడు. కనుకనే “పర”(దివ్యుడని) యని తెలియబడినాడు. జీవాత్మ కర్మక్షేత్రపు కర్మల ననుభవించుచుండ, పరమాత్ముడు మాత్రము భోక్తగా లేక కర్మల యందు వర్తించువాడుగా గాక సాక్షిగా, ఉపద్రష్టగా, అనుమంతగా, దివ్యభోక్తగా వర్తించును.
కనుకనే అతడు ఆత్మయని పిలువబడక పరమాత్మగా తెలియబడినాడు. అతడు సదా దివ్యుడు. అనగా ఆత్మ మరియు పరమాత్మ భిన్నమనునది స్పష్టమైన విషయము. పరమాత్మ సర్వత్రా పాణి,పాదములను కలిగియుండును. కాని జీవాత్మ అట్లు సర్వత్రా పాణి, పాదములను కలిగి యుండదు. అదియును గాక పరమాత్మ దేవదేవుని ప్రాతినిధ్యమైనందున హృదయస్థుడై నిలిచి, జీవాత్మ కోరు భోగానుభవమునకు అనుమతి నొసంగుచుండును. అనగా పరమాత్ముని అనుమతి లేనిదే జీవాత్మ ఏమియును చేయజాలదు. కనుకనే జీవాత్మ “భుక్తము” (పోషింపబడువాడు) అని, పరమాత్మ “భోక్త”(పోషించువాడు) యని తెలియబడుచున్నారు. అట్టి పరమాత్మ అసంఖ్యాకములుగా నున్న జీవులందరి యందును మిత్రుని రూపమున నిలిచియుండును.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 512 🌹
✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj
🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 23 🌴
23. upadraṣṭānumantā ca bhartā bhoktā maheśvaraḥ
paramātmeti cāpy ukto dehe ’smin puruṣaḥ paraḥ
🌷 Translation : Yet in this body there is another, a transcendental enjoyer, who is the Lord, the supreme proprietor, who exists as the overseer and permitter, and who is known as the Supersoul.
🌹 Purport : It is stated here that the Supersoul, who is always with the individual soul, is the representation of the Supreme Lord. He is not an ordinary living entity. Because the monist philosophers take the knower of the body to be one, they think that there is no difference between the Supersoul and the individual soul. To clarify this, the Lord says that He is represented as the Paramātmā in every body. He is different from the individual soul; He is para, transcendental. The individual soul enjoys the activities of a particular field, but the Supersoul is present not as finite enjoyer nor as one taking part in bodily activities, but as the witness, overseer, permitter and supreme enjoyer.
His name is Paramātmā, not ātmā, and He is transcendental. It is distinctly clear that the ātmā and Paramātmā are different. The Supersoul, the Paramātmā, has legs and hands everywhere, but the individual soul does not. And because the Paramātmā is the Supreme Lord, He is present within to sanction the individual soul’s desiring material enjoyment. Without the sanction of the Supreme Soul, the individual soul cannot do anything. The individual is bhukta, or the sustained, and the Lord is bhoktā, or the maintainer. There are innumerable living entities, and He is staying in them as a friend.
🌹 🌹 🌹 🌹 🌹
Comments