top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీమద్భగవద్గీత - 514: 13వ అధ్., శ్లో 25 / Bhagavad-Gita - 514: Chap. 13, Ver. 25



🌹. శ్రీమద్భగవద్గీత - 514 / Bhagavad-Gita - 514 🌹


✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 25 🌴


25. ధ్యానేనాత్మని పశ్యన్తి కేచిదాత్మానమాత్మనా |

అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే ||


🌷. తాత్పర్యం : పరమాత్ముని కొందరు ధ్యానము చేతను, మరికొందరు జ్ఞానాభ్యాసము చేతను, ఇంకను కొందరు నిష్కామకర్మ చేతను తమ యందే దర్శింతురు.


🌷. భాష్యము : మానవుని ఆత్మానుభవ అన్వేషణ ననుసరించి బద్ధజీవులు రెండు తరగతులని శ్రీకృష్ణభగవానుడు అర్జునునకు తెలియ జేయు చున్నాడు. నాస్తికులు, నిరీశ్వరవాదులు, సంశయాత్ములైన వారు ఆధ్యాత్మికభావనకు దూరులై యుందురు. అట్టివారికి అన్యముగా ఆధ్యాత్మికజీవనము నందు శ్రద్ధ కలిగినవారు అంతర్ముఖులైన భక్తులనియు, తత్త్వవేత్తలనియు, నిష్కామకర్ములనియు పిలువబడుదురు. అద్వైత సిద్ధాంతమును స్థాపించుటకు యత్నించువారలు సైతము నాస్తికులు మరియు నిరీశ్వరవాదుల యందే జమకట్టబడుదురు. అనగా శ్రీకృష్ణభగవానుని భక్తులే సరియైన ఆధ్యాత్మిక అవగాహనలో స్థితిని కలిగియుందురు.


ఆధ్యాత్మికజగత్తు భౌతికప్రకృతికి పరమమైనదనియు, అలాగుననే పరమాత్మ రూపమున సర్వుల యందు వసించియుండు శ్రీకృష్ణభగవానుడును భౌతికప్రకృతికి పరమైనవాడనియు వారు అవగాహనము చేసికొనుటయే అందులకు కారణము. పరతత్త్వమును జ్ఞానాభ్యాసము ద్వారా అవగాహన చేసికొనువారు కొందరు కలరు. వారు సైతము శ్రద్ధకలవారుగనే పరిగణింప బడుదురు. సాంఖ్యతత్త్వవేత్తలు ఈ భౌతికజగమును ఇరువదినాలుగు అంశములుగా విశ్లేషించి, ఆత్మను ఇరువదియైదవ అంశముగా భావింతురు. అట్టి ఆత్మను భౌతికంశములకు పరమైనదిగా వారు అవగతము చేసికొనినపుడు ఆ ఆత్మకు ఉన్నతముగా భగవానుడు కలడని వారు తెలిసికొనగలరు. అనగా భగవానుడు ఇరువదియారవ అంశము కాగలడు. ఈ విధముగా వారును కృష్ణభక్తిభావనలో భక్తియోగ ప్రమాణమునకు క్రమముగా చేరగలరు. అదేవిధముగా ఫలాపేక్షరహితముగా కర్మలనొనరించువారు సైతము పూర్ణలుగనే భావింపబడుదురు.


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Bhagavad-Gita as It is - 514 🌹


✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj


🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 25 🌴


25. dhyānenātmani paśyanti kecid ātmānam ātmanā

anye sāṅkhyena yogena karma-yogena cāpare


🌷 Translation : Some perceive the Supersoul within themselves through meditation, others through the cultivation of knowledge, and still others through working without fruitive desires.


🌹 Purport : The Lord informs Arjuna that the conditioned souls can be divided into two classes as far as man’s search for self-realization is concerned. Those who are atheists, agnostics and skeptics are beyond the sense of spiritual understanding. But there are others, who are faithful in their understanding of spiritual life, and they are called introspective devotees, philosophers, and workers who have renounced fruitive results. Those who always try to establish the doctrine of monism are also counted among the atheists and agnostics. In other words, only the devotees of the Supreme Personality of Godhead are best situated in spiritual understanding, because they understand that beyond this material nature are the spiritual world and the Supreme Personality of Godhead, who is expanded as the Paramātmā, the Supersoul in everyone, the all-pervading Godhead. Of course there are those who try to understand the Supreme Absolute Truth by cultivation of knowledge, and they can be counted in the class of the faithful.


The Sāṅkhya philosophers analyze this material world into twenty-four elements, and they place the individual soul as the twenty-fifth item. When they are able to understand the nature of the individual soul to be transcendental to the material elements, they are able to understand also that above the individual soul there is the Supreme Personality of Godhead. He is the twenty-sixth element. Thus gradually they also come to the standard of devotional service in Kṛṣṇa consciousness. Those who work without fruitive results are also perfect in their attitude.


🌹 🌹 🌹 🌹 🌹




0 views0 comments

Comments


bottom of page