top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీమద్భగవద్గీత - 524: 13వ అధ్., శ్లో 35 / Bhagavad-Gita - 524: Chap. 13, Ver. 35



🌹. శ్రీమద్భగవద్గీత - 524 / Bhagavad-Gita - 524 🌹


✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 35 🌴


35. క్షేత్రక్షేత్రజ్ఞయోరేవమన్తరం జ్ఞానచక్షుషా |

భూతప్రకృతిమోక్షం చ యే విదుర్యాన్తి తే పరమ్ ||


🌷. తాత్పర్యం : దేహము మరియు దేహము నెరిగిన క్షేత్రజ్ఞునకు నడుమ గల భేదమును జ్ఞానదృష్టితో దర్శించి, ప్రకృతిబంధము నుండి మోక్షమును బడయ విధానము నెరుగగలిగినవారు పరమగతిని పొందగలరు.


🌷. భాష్యము : దేహము, దేహయజమానియైన ఆత్మ, పరమాత్ముడు అనెడి మూడు అంశముల నడుమ గల భేదమును మనుజుడు తప్పక తెలిసికొనవలెనని పలుకుటయే ఈ త్రయోదశాయాధ్యాయపు సారాంశము. ఈ అధ్యాయమునందు ఎనిమిదవశ్లోకము నుండి పండ్రెండవ శ్లోకము వరకు వివరించిన మోక్షవిధానమును సైతము ప్రతియొక్కరు గుర్తింపవలెను. అంతటవారు పరమగతిని పొందగలరు. శ్రద్ధావంతుడైన మనుజుడు తొలుత సజ్జనసాంగత్యమును పొంది శ్రీకృష్ణభగవానుని గూర్చి శ్రవణము చేయవలెను. తద్ద్వారా అతడు క్రమముగా ఆత్మవికాసము నొందగలడు. మనుజుడు గురువును స్వీకరించినచో ఆత్మ మరియు అనాత్మల (భౌతికపదార్థము) నడుమగల వ్యత్యాసమును తెలియగలుగును. అది యంతట మరింత ఆధ్యాత్మికానుభూతికి సోపానము కాగలదు. జీవితపు భౌతిక భావన నుండి ముక్తులు కావలసినదిగా శిష్యులకు ఆధ్యాత్మికగురువు తన వివిధ ఉపదేశముల ద్వారా బోధనల కావించును.


ఈ దేహము భౌతికపదార్థమనియు మరియు ఇరువది నాలుగు తత్త్వములచే విశ్లేషణీయమనియు ఎవ్వరైనను గ్రహింపవచ్చును. ఆత్మ మరియు పరమాత్మ భిన్నులేగాని ఏకము కాదు. ఆత్మ మరియు ఇరువదినాలుగు భౌతికాంశముల సంయోగము చేతనే భౌతికజగత్తు నడుచుచున్నది. భౌతికజగమును ఈ విధమైన ఆత్మ మరియు చతుర్వింశతి తత్త్వముల కలయికగా గాంచుచు పరమాత్ముని నిజస్థితిని దర్శింపగలిగినవాడు ఆధ్యాత్మిక జగత్తును చేరుటకు అర్హుడగుచున్నాడు. ఈ విషయములన్నియును చింతనము మరియు ఆత్మానుభవము కొరకు ఉద్దేశింపబడియున్నవి. కనుక ఆధ్యాత్మికగురువు సహాయముచే ఈ అధ్యాయము నందలి విషయములను మనుజుడు సంపూర్ణముగా అవగాహనము చేసికొనవలెను.


శ్రీ మద్భగవద్గీత యందలి “క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము” అను త్రయోదశాధ్యాయమునకు భక్తివేదాంత భాష్యము సమాప్తము.


🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 524 🌹


✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj


🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 35 🌴


35. ṣetra-kṣetrajñayor evam antaraṁ jñāna-cakṣuṣā

bhūta-prakṛti-mokṣaṁ ca ye vidur yānti te param


🌷 Translation : Those who see with eyes of knowledge the difference between the body and the knower of the body, and can also understand the process of liberation from bondage in material nature, attain to the supreme goal.


🌹 Purport : The purport of this Thirteenth Chapter is that one should know the distinction between the body, the owner of the body, and the Supersoul. One should recognize the process of liberation, as described in verses 8 through 12. Then one can go on to the supreme destination. A faithful person should at first have some good association to hear of God and thus gradually become enlightened. If one accepts a spiritual master, one can learn to distinguish between matter and spirit, and that becomes the stepping-stone for further spiritual realization.


A spiritual master, by various instructions, teaches his students to get free from the material concept of life. For instance, in Bhagavad-gītā we find Kṛṣṇa instructing Arjuna to free him from materialistic considerations. One can understand that this body is matter; it can be analyzed with its twenty-four elements. The soul and the Supersoul are two. This material world is working by the conjunction of the soul and the twenty-four material elements. One who can see the constitution of the whole material manifestation as this combination of the soul and material elements and can also see the situation of the Supreme Soul becomes eligible for transfer to the spiritual world. These things are meant for contemplation and for realization, and one should have a complete understanding of this chapter with the help of the spiritual master.


Thus end the Bhaktivedanta Purports to the Thirteenth Chapter of the Śrīmad Bhagavad-gītā in the Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness


🌹 🌹 🌹 🌹 🌹



0 views0 comments

Opmerkingen


bottom of page