top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీమద్భగవద్గీత - 525: 14వ అధ్., శ్లో 01 / Bhagavad-Gita - 525: Chap. 14, Ver. 01



🌹. శ్రీమద్భగవద్గీత - 525 / Bhagavad-Gita - 525 🌹


✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 1 🌴


01. శ్రీ భగవానువాచ


పరం భూయ: ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమమ్ |

యజ్జ్ఞాత్వా మునయ: సర్వే పరాం సిద్ధిమితో గతా: ||


🌷. తాత్పర్యం : దేవదేవుడైన శ్రీకృష్ణుడు పలికెను : దేనిని తెలిసికొని మునులందరును పరమసిద్ధిని పొందిరో అట్టి జ్ఞానములలో కెల్ల ఉత్తమమైన ఈ దివ్యజ్ఞానమును నీకిప్పుడు నేను మరల తెలియ జేయుదును.


🌷. భాష్యము : సప్తమాధ్యాయము నుండి ద్వాదశాధ్యాయపు అంతము వరకు పరతత్త్వమును, దేవదేవుడును అగు తనను గూర్చి విశదముగా వివరించిన శ్రీకృష్ణభగవానుడు తిరిగి ఇప్పుడు అర్జునునకు మరింత జ్ఞానవికాసమును కలిగించుచున్నాడు. తాత్త్విక చింతన విధానము ద్వారా ఈ అధ్యాయమును అవగాహన చేసికొనినచో మనుజుడు శీఘ్రముగా భక్తియోగమును అవగతము చేసికొనగలడు. నమ్రతతో జ్ఞానాభివృద్ధిని సాధించుట ద్వారా జీవుడు భౌతికబంధము నుండి ముక్తుడు కాగలడని గడచిన త్రయోదశాధ్యాయమున వివరింపబడినది. ఆలాగుననే ప్రకృతి త్రిగుణముల సంపర్కము చేతనే జీవుడు భౌతికజగములో బంధితుడగుననియు పూర్వము తెలుపబడినది.


ఇక ప్రస్తుతము ఈ అధ్యాయమున ప్రకృతి త్రిగుణములనేవో, అవి ఎట్లు వర్తించునో, ఏ విధముగా అవి బంధ, మోక్షములను గూర్చునో దేవదేవుడైన శ్రీకృష్ణుడు తెలియజేయుచున్నాడు. ఈ అధ్యాయమునందు తెలుపబడిన జ్ఞానము పూర్వపు అధ్యాయములందు తెలుపబడిన జ్ఞానము కన్నను మిగుల శ్రేష్టమని భగవానుడు పలుకుచున్నాడు. అట్టి ఈ జ్ఞానమును అవగాహనము చేసికొనుట ద్వారా పలువురు మునులు పరమసిద్ధిని పొంది ఆధ్యాత్మిక జగత్తును చేరిరి.


🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 525 🌹


✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj


🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 01 🌴


01. śrī-bhagavān uvāca


paraṁ bhūyaḥ pravakṣyāmi jñānānāṁ jñānam uttamam

yaj jñātvā munayaḥ sarve parāṁ siddhim ito gatāḥ


🌷 Translation : The Supreme Personality of Godhead said: Again I shall declare to you this supreme wisdom, the best of all knowledge, knowing which all the sages have attained the supreme perfection.


🌹 Purport : From the Seventh Chapter to the end of the Twelfth Chapter, Śrī Kṛṣṇa in detail reveals the Absolute Truth, the Supreme Personality of Godhead. Now, the Lord Himself is further enlightening Arjuna. If one understands this chapter through the process of philosophical speculation, he will come to an understanding of devotional service. In the Thirteenth Chapter, it was clearly explained that by humbly developing knowledge one may possibly be freed from material entanglement.


It has also been explained that it is due to association with the modes of nature that the living entity is entangled in this material world. Now, in this chapter, the Supreme Personality explains what those modes of nature are, how they act, how they bind and how they give liberation. The knowledge explained in this chapter is proclaimed by the Supreme Lord to be superior to the knowledge given so far in other chapters. By understanding this knowledge, various great sages attained perfection and transferred to the spiritual world. The Lord now explains the same knowledge in a better way. This knowledge is far, far superior to all other processes of knowledge thus far explained, and knowing this many attained perfection. Thus it is expected that one who understands this Fourteenth Chapter will attain perfection.


🌹 🌹 🌹 🌹 🌹




0 views0 comments

Comments


bottom of page