top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీమద్భగవద్గీత - 531: 14వ అధ్., శ్లో 07 / Bhagavad-Gita - 531: Chap. 14, Ver. 07



🌹. శ్రీమద్భగవద్గీత - 531 / Bhagavad-Gita - 531 🌹


✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 7 🌴


07. రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసఙ్గసముద్భవమ్ |

తన్నిబధ్నాతి కౌన్తేయ కర్మసఙ్గేన దేహినమ్ ||


🌷. తాత్పర్యం : ఓ కౌంతేయా! అపరిమితములైన కోరికలు మరియు ఆకాంక్షల వలన రజోగుణము ఉద్భవించుచున్నది. దీని కారణమున జీవుడు కామ్యకర్మలచే బద్ధుడగును.


🌷. భాష్యము : స్త్రీ పురుషుల నడుమ గల ఆకర్షణము రజోగుణలక్షణము. అనగా స్త్రీ పురుషుని యెడ ఆకర్షణను కలిగియుండుట మరియు పురుషుడు స్త్రీ యెడ ఆకర్షితుడగుట యనునది రజోగుణమనబడును. ఇట్టి రజోగుణము అధికమైనప్పుడు మనుజుడు భౌతికానందాభిలాషుడై ఇంద్రియసుఖమును అనుభవింపగోరును. అట్టి ఇంద్రియసుఖము కొరకు రజోగుణము నందున్నవాడు సంఘమునందు లేదా దేశమునందు గౌరవమును మరియు చక్కని ఇల్లు, భార్య, సంతానము కలిగిన సుఖసంసారమును వాంచించును. ఇవియన్నియును రజోగుణము నుండి పుట్టినవే. ఇట్టి విషయములకై ప్రాకులాడునంత కాలము అతడు అధికముగా శ్రమింప వలసి వచ్చును.


కనుకనే రజోగుణము నందున్నవాడు తన కర్మఫలముల యెడ రతుడై యుండి, ఆ కర్మలచే బంధితుడగునని ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. భార్యను, సంతానమును, సంఘమును సంతృప్తిపరచుటకు మరియు తన గౌరవమును నిలుపుకొనుటకు మనుజుడు సదా కర్మయందు నిమగ్నుడు కావలసివచ్చును. దీనిని బట్టి భౌతికప్రపంచమంతయు ఇంచుమించుగా రజోగుణమునందు ఉన్నదనియే చెప్పవచ్చును. రజోగుణము దృష్ట్యా నవనాగరికత అభివృద్ది నొందినట్లు పరిగణింపబడినను వాస్తవమునకు సత్త్వగుణాభివృద్దియే ప్రగతిగా పరిగణింపబడును. పూర్వము ఆ విధముగనే భావింపబడెడిది. సత్త్వగుణమునందు నిలిచినవారికే ముక్తిలేదన్నచో రజోగుణమున బద్ధులైనవారి మాట వేరుగా చెప్పానేల?


🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 531 🌹


✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj


🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 07 🌴


07. rajo rāgātmakaṁ viddhi tṛṣṇā-saṅga-samudbhavam

tan nibadhnāti kaunteya karma-saṅgena dehinam


🌷 Translation : The mode of passion is born of unlimited desires and longings, O son of Kuntī, and because of this the embodied living entity is bound to material fruitive actions.


🌹 Purport :The mode of passion is characterized by the attraction between man and woman. Woman has attraction for man, and man has attraction for woman. This is called the mode of passion. And when the mode of passion is increased, one develops the hankering for material enjoyment. He wants to enjoy sense gratification. For sense gratification, a man in the mode of passion wants some honor in society, or in the nation, and he wants to have a happy family, with nice children, wife and house. These are the products of the mode of passion.


As long as one is hankering after these things, he has to work very hard. Therefore it is clearly stated here that he becomes associated with the fruits of his activities and thus becomes bound by such activities. In order to please his wife, children and society and to keep up his prestige, one has to work. Therefore, the whole material world is more or less in the mode of passion. Modern civilization is considered to be advanced in the standard of the mode of passion. Formerly, the advanced condition was considered to be in the mode of goodness. If there is no liberation for those in the mode of goodness, what to speak of those who are entangled in the mode of passion?


🌹 🌹 🌹 🌹 🌹



0 views0 comments

Kommentare


bottom of page