top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీమద్భగవద్గీత - 541: 14వ అధ్., శ్లో 17 / Bhagavad-Gita - 541: Chap. 14, Ver. 17



🌹. శ్రీమద్భగవద్గీత - 541 / Bhagavad-Gita - 541 🌹


✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 17 🌴


17. సత్త్వాత్సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ |

ప్రమాదమొహౌ తమసో భవతో అజ్ఞానమేవ చ ||


🌷. తాత్పర్యం : సత్త్వగుణము నుండి వాస్తవజ్ఞానము వృద్దినొందును. రజోగుణము నుండి లోభము వృద్ధినొందగా, తమోగుణము నుండి అజ్ఞానము, బుద్ధిహీనత, భ్రాంతి యనునవి వృద్దినొందుచున్నవి.


🌷. భాష్యము : ప్రస్తుత నాగరికత జీవుల నిజస్వభావమునకు అనుకూలమైనది కానందున కృష్ణభక్తిభావనము ఉపదేశించబడుచున్నది. కృష్ణభక్తిభావన ద్వారా సమాజమునందు సత్త్వగుణము వృద్దినొందును. ఆ విధముగా సత్త్వగుణము వృద్ధియైనప్పుడు జనులు యథార్థదృష్టిని పొంది విషయములను యథాతథముగా గాంచగలుగుదురు. తమోగుణము నందు జనులు పశుప్రాయులై దేనిని కూడా స్పష్టముగా అవగాహన చేసికొనలేరు. ఉదాహరణమునకు ఒక జంతువును వధించుట ద్వారా అదే జంతువుతో తరువాతి జన్మలో వధింపబడవలసి వచ్చునని తమోగుణము నందు జనులు ఎరుగజాలరు. వాస్తవజ్ఞానమునకు సంబంధించిన విద్య జనుల వద్ద లేనందునే వారట్లు బాధ్యతా రహితులగుచున్నారు.


ఇట్టి బాధ్యతా రాహిత్యమును నివారించుటకు జనులందరికినీ సత్త్వగుణవృద్దికై విద్య తప్పనిసరియై యున్నది. సత్త్వగుణము నందు వాస్తవముగా విద్యావంతులైనప్పుడు వారు స్థిరబుద్ధిగలవారై యథార్థజ్ఞానమును సంపాదింతురు. అపుడు వారు ఆనందభాగులు మరియు జీవితమున సఫలురు కాగలరు. జగమంతయు ఆ రీతి సుఖభాగులు మరియు జయశీలూరు కాకున్నను, ప్రజలలో కొద్దిశాతమైనను కృష్ణభక్తిభావనను వృద్ధిచేసికొని సత్త్వగుణములో నిలిచినచో ప్రపంచమునందు శాంతి మరియు అభ్యుదయములకు అవకాశమేర్పడును.


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Bhagavad-Gita as It is - 541 🌹


✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj


🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 17 🌴


17. sattvāt sañjāyate jñānaṁ rajaso lobha eva ca

pramāda-mohau tamaso bhavato ’jñānam eva ca


🌷 Translation : From the mode of goodness, real knowledge develops; from the mode of passion, greed develops; and from the mode of ignorance develop foolishness, madness and illusion.


🌹 Purport : Since the present civilization is not very congenial to the living entities, Kṛṣṇa consciousness is recommended. Through Kṛṣṇa consciousness, society will develop the mode of goodness. When the mode of goodness is developed, people will see things as they are. In the mode of ignorance, people are just like animals and cannot see things clearly. In the mode of ignorance, for example, they do not see that by killing one animal they are taking the chance of being killed by the same animal in the next life. Because people have no education in actual knowledge, they become irresponsible. To stop this irresponsibility, education for developing the mode of goodness of the people in general must be there. When they are actually educated in the mode of goodness, they will become sober, in full knowledge of things as they are.


Then people will be happy and prosperous. Even if the majority of the people aren’t happy and prosperous, if a certain percentage of the population develops Kṛṣṇa consciousness and becomes situated in the mode of goodness, then there is the possibility for peace and prosperity all over the world. Otherwise, if the world is devoted to the modes of passion and ignorance, there can be no peace or prosperity. In the mode of passion, people become greedy, and their hankering for sense enjoyment has no limit. One can see that even if one has enough money and adequate arrangements for sense gratification, there is neither happiness nor peace of mind. That is not possible, because one is situated in the mode of passion. If one wants happiness at all, his money will not help him; he has to elevate himself to the mode of goodness by practicing Kṛṣṇa consciousness.


🌹 🌹 🌹 🌹 🌹



0 views0 comments

Comments


bottom of page