🌹. శ్రీమద్భగవద్గీత - 544 / Bhagavad-Gita - 544 🌹
✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 20 🌴
20. గుణానేతానతీత్య త్రీన్ దేహీ దేహసముద్భవాన్ |
జన్మమృత్యుజరాదు:ఖైర్విముక్తోమృతమశ్నుతే ||
🌷. తాత్పర్యం : దేహధారియగు జీవుడు దేహముతో కూడియున్న ఈ త్రిగునములను దాటగాలిగినప్పడు జనన, మరణ, వార్ధక్యక్యముల నుండియు మరియు వాని దు:ఖముల నుండియు విడివడి ఈ జన్మమునందే అమృతత్వమును పొందును.
🌷. భాష్యము : సంపూర్ణ కృష్ణభక్తిభావనలో ప్రస్తుత దేహమునందే మనుజుడు ఏ విధముగా ఆధ్యాత్మికస్థితిలో నిలువగలడో ఈ శ్లోకమున వివరింపబడినది. “దేహే” యను పదమునకు దేహధారి యని భావము. అనగా జీవుడు దేహధారియైనను ఆధ్యాత్మికజ్ఞానమునందు పురోగతిని బడయుట ద్వారా త్రిగుణముల ప్రభావము నుండి బయటపడగలడు. దేహత్యాగము పిమ్మట నిక్కముగా భగవద్దామమునకు చేరనున్నందున అతడు ప్రస్తుత దేహమునందే ఆధ్యాత్మికజీవన ఆనందమును అనుభవింపగలడు.
ఆధ్యాత్మికకానందమును అతడు ప్రస్తుత దేహమునందు అనుభవించుననుట నిశ్చయమైన విషయము. అనగా కృష్ణభక్తిభావనలో నొనరింపబడు భక్తియుత సేవ భౌతికసంపర్కము నుండి ముక్తికి చిహ్నమై యున్నది. ఈ విషయము రాబోవు అష్టాదశాధ్యాయమున వివరింపబడును. అనగా త్రిగుణముల ప్రభావము నుండి మనుజుడు బయటపడినపుడు భక్తియుతసేవ యందు ప్రవేశించును.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 544 🌹
✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj
🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 20 🌴
20. guṇān etān atītya trīn dehī deha-samudbhavān
janma-mṛtyu-jarā-duḥkhair vimukto ’mṛtam aśnute
🌷 Translation : When the embodied being is able to transcend these three modes associated with the material body, he can become free from birth, death, old age and their distresses and can enjoy nectar even in this life.
🌹 Purport : How one can stay in the transcendental position, even in this body, in full Kṛṣṇa consciousness, is explained in this verse. The Sanskrit word dehī means “embodied.” Although one is within this material body, by his advancement in spiritual knowledge he can be free from the influence of the modes of nature. He can enjoy the happiness of spiritual life even in this body because, after leaving this body, he is certainly going to the spiritual sky.
But even in this body he can enjoy spiritual happiness. In other words, devotional service in Kṛṣṇa consciousness is the sign of liberation from material entanglement, and this will be explained in the Eighteenth Chapter. When one is freed from the influence of the modes of material nature, he enters into devotional service.
🌹 🌹 🌹 🌹 🌹
Comments