top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీమద్భగవద్గీత - 545: 14వ అధ్., శ్లో 21 / Bhagavad-Gita - 545: Chap. 14, Ver. 21


🌹. శ్రీమద్భగవద్గీత - 545 / Bhagavad-Gita - 545 🌹


✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 21 🌴


21. అర్జున ఉపాచ


కైర్లింగైః త్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో ।

కిమాచారః కథం చైతాన్ త్రీన్ గుణానతివర్తతే ।। 21 ।।


🌷. తాత్పర్యం : అర్జునుడు ప్రశ్నించెను : హే ప్రభూ! ఈ త్రిగుణములకు అతీతుడైనవాడు ఏ లక్షణముల ద్వారా తెలియబడును? అతని ప్రవర్తనమెట్టిది? ప్రకృతి త్రిగుణములను అతడు ఏ విధముగా అధిగమించును?


🌷. భాష్యము : ఈ శ్లోకమునందలి అర్జునుని ప్రశ్నలు మిగుల సమంజసముగా నున్నవి. త్రిగుణములను దాటినట్టి మహాత్ముని లక్షణములను అతడు తెలిసికొనగోరుచున్నాడు. అట్టి త్రిగుణాతీత మహాత్ముని లక్షణములను తొలుత అతడు విచారణ కావించుచున్నాడు. అట్టివాడు త్రిగుణ ప్రభావమును ఇదివరకే దాటియున్నాడని మనుజుడు ఎట్లు జీవించునో, అతని కర్మలేవియో అర్జునుడు అడుగుచున్నాడు.


ఆ కర్మలు నియమబద్ధములైనవా లేక నియమబద్ధములు కానివా! పిదప అర్జునుడు అట్టి దివ్యస్వభావమును పొందగలిగే మార్గమును గూర్చి ప్రశ్నించుచున్నాడు. ఈ విషయము అత్యంత ముఖ్యమైనది. సర్వదా దివ్యస్థితి యందు నిలుచుటకు ప్రత్యక్షమార్గమును తెలియనిదే ఎవ్వరును అట్టి దివ్యలక్షణములను కలిగియుండు నవకాశము లేదు.


కనుకనే అర్జునుడు అడిగిన ఈ ప్రశ్నలన్నియును అత్యంత ముఖ్యమై యున్నవి. శ్రీకృష్ణుడు ఆ ప్రశ్నలన్నింటికిని సమాధానమొసగుచున్నాడు.


🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 545 🌹


✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj


🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 21 🌴


21. arjuna uvāca


kair liṅgais trīn guṇān etān atīto bhavati prabho

kim-ācāraḥ kathaṁ caitāṁs trīn guṇān ativartate


🌷 Translation : Arjuna inquired: O my dear Lord, by which symptoms is one known who is transcendental to these three modes? What is his behavior? And how does he transcend the modes of nature?


🌹 Purport : In this verse, Arjuna’s questions are very appropriate. He wants to know the symptoms of a person who has already transcended the material modes. He first inquires of the symptoms of such a transcendental person.


How can one understand that he has already transcended the influence of the modes of material nature? The second question asks how he lives and what his activities are. Are they regulated or nonregulated? Then Arjuna inquires of the means by which he can attain the transcendental nature.


That is very important. Unless one knows the direct means by which one can be situated always transcendentally, there is no possibility of showing the symptoms. So all these questions put by Arjuna are very important, and the Lord answers them.


🌹 🌹 🌹 🌹 🌹


0 views0 comments

コメント


bottom of page