top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీమద్భగవద్గీత - 555: 15వ అధ్., శ్లో 04 / Bhagavad-Gita - 555: Chap. 15, Ver. 04



🌹. శ్రీమద్భగవద్గీత - 555 / Bhagavad-Gita - 555 🌹


✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 15వ అధ్యాయము - పురుషోత్తమ యోగము - 04 🌴


04. తత: పదం తత్పరిమార్గతవ్యం యస్మిన్ గతా న నివర్తన్తి భూయ: |

తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యత: ప్రవృత్తి: ప్రసృతా పురాణీ ||


🌷. తాత్పర్యం : ఆ పిదప పునరావృత్తి రహితమైన దివ్యపదమును పొందుటకు ప్రయత్నించి, అనాదికాలము నుండి ఎవ్వని వలన సమస్తము ఆరంభమయ్యెనో మరియు వ్యాప్తినొందెనో అట్టి పరమపురుషుని అచ్చట శరణు పొందవలెను.


🌷. భాష్యము : చివరకు బ్రహ్మదేవునికి ఆదియైన శ్రీకృష్ణుని చేరిన పిమ్మట పరిశోధన పరిసమాప్తి చెందును. ఈ సంసారవృక్షపు అట్టి మూలమును (పూర్ణపురుషోత్తముడగు భగవానుని) దేవదేవుని గూర్చిన సంపూర్ణజ్ఞానము కలవారి సాంగత్యమున ప్రతియొక్కరు పరిశోధింప వలెను.


అట్టి అవగాహనచే మనుజుడు క్రమముగా యథార్థము యొక్క మిథ్యాప్రతిబింబము నుండి అసంగుడై, జ్ఞానముచే దానితో బంధమును ఛేదించి యథార్థవృక్షమునందు నిజాముగా ప్రతిష్టితుడగును.


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Bhagavad-Gita as It is - 555 🌹


✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj


🌴 Chapter 15 - Purushothama Yoga - 04 🌴


04. tataḥ padaṁ tat parimārgitavyaṁ yasmin gatā na nivartanti bhūyaḥ

tam eva cādyaṁ puruṣaṁ prapadye yataḥ pravṛttiḥ prasṛtā purāṇī


🌷 Translation : But with determination one must cut down this strongly rooted tree with the weapon of detachment. Thereafter, one must seek that place from which, having gone, one never returns, and there surrender to that Supreme Personality of Godhead from whom everything began and from whom everything has extended since time immemorial.


🌹 Purport : By searching in this way, one comes to Brahmā, who is generated by the Garbhodaka-śāyī Viṣṇu. Finally, in this way, when one reaches the Supreme Personality of Godhead, that is the end of research work. One has to search out that origin of this tree, the Supreme Personality of Godhead, through the association of persons who are in knowledge of that Supreme Personality of Godhead.


Then by understanding one becomes gradually detached from this false reflection of reality, and by knowledge one can cut off the connection and actually become situated in the real tree.


🌹 🌹 🌹 🌹 🌹


0 views0 comments

Commentaires


bottom of page