top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీమద్భగవద్గీత - 559: 15వ అధ్., శ్లో 08 / Bhagavad-Gita - 559: Chap. 15, Ver. 08



🌹. శ్రీమద్భగవద్గీత - 559 / Bhagavad-Gita - 559 🌹


✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 15వ అధ్యాయము - పురుషోత్తమ యోగము - 08 🌴


08. శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వర: |

గృహీత్వైతాని సంయాతి వాయుర్గన్ధానివాశయాత్ ||


🌷. తాత్పర్యం : వాయువు గంధము మోసుకొనిపోవునట్లే, జీవుడు ఈ భౌతికజగమున తన వివిధ భావములను ఒక దేహము నుండి వేరొక దేహమునకు గొనిపోవుచుండును. ఈ విధముగా అతడు ఒక దేహమును గ్రహించి, తిరిగి వేరొక దేహమును పొందుటకై దానిని విడుచుచుండును.


🌷. భాష్యము : తన దేహమునకు “ఈశ్వరుడు” (నియామకుడు) అని జీవుడిచ్చట వర్ణింపబడినాడు. తలచినచో అతడు ఉన్నతజన్మకు సంబంధించిన దేహమును పొందవచ్చును లేదా నీచదేహములందు ప్రవేశింపవచ్చును. ఈ విషయమున అతనికి సూక్ష్మమైన స్వాతంత్ర్యము కలదు. అనగా దేహమందలి మార్పు దేహియైన అతని పైననే ఆధారపడియున్నది. అతడు రూపొందించుకొనిన చైతన్యము మరణసమయమున అతనిని వేరొక విధమైన దేహమునకు గొనిపోవును. అతడు తన చైతన్యము మరణసమయమున అతనిని వేరొక విధమైన దేహమునకు గొనిపోవును. అతడు తన చైతన్యమును శునక, మార్జాలముల వంటి జంతువుల చైతన్యముతో సమానము కావించుకొనినచో అట్టి శునక, మార్జాల దేహమునే తప్పక పొందవలసివచ్చును. దేవతా లక్షణములందు అతని చైతన్యము లగ్నమైనచో మరణానంతరము దేవతాశరీరమును పొందును.


ఒకవేళ కృష్ణభక్తిరసభావితుడైనచో ఆధ్యాత్మిక జగము నందలి కృష్ణలోకమును చేరి కృష్ణుని సాహచార్యమును పొందును. కావున దేహము నశించిన పిమ్మట సర్వము ముగిసిపోవునని పలుకుట మిథ్యావాదమే యగును. ఒక దేహము నుండి వేరొక దేహమునకు మార్పుచెందు జీవుని వర్తమానదేహము మరియు దాని యందలి కర్మలు భావిజన్మకు నాంది కాగలవు. కర్మననుసరించే జీవుడు దేహమును పొందును. ఆ విధముగా లభించిన దేహమును జీవుడు తిరిగి సుక్ష్మశరీరమే తరువాతి జన్మలోని దేహమును తయారు చేయుచున్నదని ఇచ్చట పేర్కొనబడినది. ఒక దేహమును విడిచి వేరొక దేహమును పొందుట మరియు దేహమందున్నప్పుడు వివిధక్లేశములకు గురియగుట యనెడి ఈ విధానమే “కర్షతి” (జీవనసంఘర్షణము) యని పిలువబడును.


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Bhagavad-Gita as It is - 559 🌹


✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj


🌴 Chapter 15 - Purushothama Yoga - 08 🌴


08. śarīraṁ yad avāpnoti yac cāpy utkrāmatīśvaraḥ

gṛhītvaitāni saṁyāti vāyur gandhān ivāśayāt


🌷 Translation : The living entity in the material world carries his different conceptions of life from one body to another, as the air carries aromas. Thus he takes one kind of body and again quits it to take another.


🌹 Purport : Here the living entity is described as īśvara, the controller of his own body. If he likes, he can change his body to a higher grade, and if he likes he can move to a lower class. Minute independence is there. The change his body undergoes depends upon him. At the time of death, the consciousness he has created will carry him on to the next type of body. If he has made his consciousness like that of a cat or dog, he is sure to change to a cat’s or dog’s body. And if he has fixed his consciousness on godly qualities, he will change into the form of a demigod. And if he is in Kṛṣṇa consciousness, he will be transferred to Kṛṣṇaloka in the spiritual world and will associate with Kṛṣṇa. It is a false claim that after the annihilation of this body everything is finished.


The individual soul is transmigrating from one body to another, and his present body and present activities are the background of his next body. One gets a different body according to karma, and he has to quit this body in due course. It is stated here that the subtle body, which carries the conception of the next body, develops another body in the next life. This process of transmigrating from one body to another and struggling while in the body is called karṣati, or struggle for existence.


🌹 🌹 🌹 🌹 🌹


0 views0 comments

Comments


bottom of page