🌹. శ్రీమద్భగవద్గీత - 565 / Bhagavad-Gita - 565 🌹
✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 15వ అధ్యాయము - పురుషోత్తమ యోగము - 14 🌴
14. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత: |
ప్రాణాపానసమాయుక్త: పచామ్యన్నం చతుర్విధమ్ ||
🌷. తాత్పర్యం : ప్రాణుల దేహములందలి జఠరాగ్నిని నేను, ప్రాణాపానవాయువులతో కూడి నేను నాలుగు విధములైన ఆహారములను పచనము చేయుచున్నాను.
🌷. భాష్యము : భుజించిన ఆహారము జీర్ణము చేయుటకు ఉదరమందు అగ్ని కలదని ఆయుర్వేదము ద్వారా మనకు అవగతమగుచున్నది. అట్టి అగ్ని తగినరీతి ప్రజ్వరిల్లినపుడు ఆకలి కలుగును. సరిగా ప్రజ్వలితము కానపుడు ఆకలి కాదు. ఆ విధముగా అగ్ని తగినరీతి ప్రజ్వలితము కానపుడు వైద్యము అవసరమగును. ఉదరమునందలి ఆ అగ్ని దేవదేవుడైన శ్రీకృష్ణుని ప్రాతినిధ్యము. శ్రీకృష్ణ భగవానుడు అగ్నిరూపమున ఉదరమునందు వసించి అన్నిరకములైన ఆహారమును పచనము చేయుచున్నాడని బృహదారాణ్య కోపనిషత్తు(5.9.1) నిర్ధారించు చున్నది (ఆయ మగ్ని: వైశ్వానరో యో (యం అంత:పురుషే యేనేద మన్నం పచ్యతే). అనగా భగవానుడు సర్వవిధ ఆహారపచనము నందు సహాయభూతుడగు చున్నందున భోజన విషయమున జీవుడు స్వతంత్రుడు కాడు. జీర్ణక్రియయందు భగవానుడు తోడ్పడనిదే జీవునకు ఆహారమును భుజింప అవకాశము కలుగదు.
ఈ విధముగా శ్రీకృష్ణుభగవానుడు ఆహారమును సృష్టించుట మరియు ఉదరమున జీర్ణము చేయుట వంటి కార్యముల నొనరించుట చేతనే, మనము జీవితమున అనుభవించ గలుగుచున్నాము. ఈ విషయము వేదాంతసూత్రము నందు(1.2.27) కూడా “శబ్దాదిభ్యో(న్త: ప్రతిష్టానాచ్చ” యని స్థిరీకరింపబడినది. అనగా శ్రీకృష్ణభగవానుడు శబ్దమునందు, దేహమునందు, వాయువు నందేగాక ఉదరమందు జీర్ణకారకశక్తి రూపమును స్థితుడై యున్నాడు. ఇక నాలుగురకముల ఆహారములనగా భక్ష్యములు, భోజ్యములు, చోష్యములు, లేహ్యములని భావము. వీటన్నింటిని జీర్ణము చేయువాడు భగవానుడే.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 565 🌹
✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj
🌴 Chapter 15 - Purushothama Yoga - 14 🌴
14. ahaṁ vaiśvānaro bhūtvā prāṇināṁ deham āśritaḥ
prāṇāpāna-samāyuktaḥ pacāmy annaṁ catur-vidham
🌷 Translation : I am the fire of digestion in the bodies of all living entities, and I join with the air of life, outgoing and incoming, to digest the four kinds of foodstuff.
🌹 Purport : According to Āyur-vedic śāstra, we understand that there is a fire in the stomach which digests all food sent there. When the fire is not blazing there is no hunger, and when the fire is in order we become hungry. Sometimes when the fire is not going nicely, treatment is required. In any case, this fire is representative of the Supreme Personality of Godhead. Vedic mantras (Bṛhad-āraṇyaka Upaniṣad 5.9.1) also confirm that the Supreme Lord or Brahman is situated in the form of fire within the stomach and is digesting all kinds of foodstuff (ayam agnir vaiśvānaro yo ’yam antaḥ puruṣe yenedam annaṁ pacyate). Therefore since He is helping the digestion of all kinds of foodstuff, the living entity is not independent in the eating process.
Unless the Supreme Lord helps him in digesting, there is no possibility of eating. He thus produces and digests foodstuff, and by His grace we are enjoying life. In the Vedānta-sūtra (1.2.27) this is also confirmed. Śabdādibhyo ’ntaḥ pratiṣṭhānāc ca: the Lord is situated within sound and within the body, within the air and even within the stomach as the digestive force. There are four kinds of foodstuff – some are drunk, some are chewed, some are licked up, and some are sucked – and He is the digestive force for all of them.
🌹 🌹 🌹 🌹 🌹
Comentários