🌹. శ్రీమద్భగవద్గీత - 566 / Bhagavad-Gita - 566 🌹
✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 15వ అధ్యాయము - పురుషోత్తమ యోగము - 15 🌴
15. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త: స్మృతిర్ జ్ఞానమపోహనం చ |
వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్ వేదవిదేవ చాహమ్ ||
🌷. తాత్పర్యం : సర్వుల హృదయములందు నేను నిలిచియున్నాను. నా నుండియే స్మృతి, జ్ఞానము, మరుపు అనునవి కలుగుచున్నవి. నేనే సమస్తవేదముల ద్వారా తెలియదగినవాడను. వాస్తవమునకు వేదాంతకర్తను, వేదముల నెరిగినవాడను నేనే.
🌷. భాష్యము : దేవదేవుడైన శ్రీకృష్ణుడు పరమాత్మరూపమున ఎల్లరి హృదయములందు నిలిచియుండును. అట్టి హృదయస్థ పరమాత్మ నుండియే జీవుని సర్వకర్మలు ఆరంభమగుచున్నవి. గతజన్మ విషయమునంతటిని జీవుడు మరచినను పరమాత్మ రూపమున సమస్త కర్మకు సాక్షిగా నుండు భగవానుని నిర్దేశము ననుసరించియే అతడు వర్తించవలసివచ్చును.
కనుక అతడు పూర్వకర్మానుసారముగా తన కర్మలను ఆరంభించును. కర్మనొనరించుటకు కావలసిన జ్ఞానము. స్మృతి అతనికి ఒసగబడును. గతజన్మమును గూర్చిన మరుపు కూడా అతనికి కలుగుచున్నది. ఈ విధముగా భగవానుడు సర్వవ్యాపియేగాక, ప్రతివారి హృదయమునందు కూడా నిలిచి వివిధ కర్మఫలముల నొసగుచుండును. అట్టి శ్రీకృష్ణభగవానుడు నిరాకారబ్రహ్మము మరియు పరమాత్మ రూపములందే గాక వేదరూపమునందును పూజనీయుడు. జనులు తమ జీవితమును ధర్మబద్ధముగా మరియు భక్తికి అనుగుణముగా మలచుకొని భగవద్ధామమును చేరు రీతిలో వేదములు తగిన నిర్దేశము నొసగుచున్నవి.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 566 🌹
✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj
🌴 Chapter 15 - Purushothama Yoga - 15 🌴
15. sarvasya cāhaṁ hṛdi sanniviṣṭo mattaḥ smṛtir jñānam apohanaṁ ca
vedaiś ca sarvair aham eva vedyo vedānta-kṛd veda-vid eva cāham
🌷 Translation : I am seated in everyone’s heart, and from Me come remembrance, knowledge and forgetfulness. By all the Vedas, I am to be known. Indeed, I am the compiler of Vedānta, and I am the knower of the Vedas.
🌹 Purport : The Supreme Lord is situated as Paramātmā in everyone’s heart, and it is from Him that all activities are initiated. The living entity forgets everything of his past life, but he has to act according to the direction of the Supreme Lord, who is witness to all his work. Therefore he begins his work according to his past deeds. Required knowledge is supplied to him, and remembrance is given to him, and he forgets, also, about his past life. Thus, the Lord is not only all-pervading;
He is also localized in every individual heart. He awards the different fruitive results. He is worshipable not only as the impersonal Brahman, the Supreme Personality of Godhead and the localized Paramātmā, but as the form of the incarnation of the Vedas as well. The Vedas give the right direction to people so that they can properly mold their lives and come back to Godhead, back to home. The Vedas offer knowledge of the Supreme Personality of Godhead, Kṛṣṇa, and Kṛṣṇa in His incarnation as Vyāsadeva is the compiler of the Vedānta-sūtra. The commentation on the Vedānta-sūtra by Vyāsadeva in the Śrīmad-Bhāgavatam gives the real understanding of Vedānta-sūtra. The Supreme Lord is so full that for the deliverance of the conditioned soul He is the supplier and digester of foodstuff, the witness of his activity, and the giver of knowledge in the form of the Vedas and as the Supreme Personality of Godhead, Śrī Kṛṣṇa, the teacher of the Bhagavad-gītā. He is worshipable by the conditioned soul. Thus God is all-good; God is all-merciful.
🌹 🌹 🌹 🌹 🌹
Comentaris