🌹. శ్రీమద్భగవద్గీత - 571 / Bhagavad-Gita - 571 🌹
✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 15వ అధ్యాయము - పురుషోత్తమ యోగము - 20 🌴
20. ఇతి గుహ్యతమం శాస్త్రమిదముక్తం మయానఘ |
ఏతద్ బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్క్రుత కృత్యశ్చ భారత ||
🌷. తాత్పర్యం : ఓ పాపరహితుడా! వేదములందలి అత్యంత రహస్యమైన ఈ భాగమును నీకిప్పుడు నేను వెల్లడించితిని. దీనిని అవగాహన చేసికొనినవాడు బుద్ధిమంతుడు కాగలడు. అతని ప్రయత్నములు పూర్ణవిజయమును బడయగలవు.
🌷. భాష్యము : సమస్త శాస్త్రముల సారాంశమిదియేనని శ్రీకృష్ణభగవానుడు ఇచ్చట స్పష్టముగా వివరించుచున్నాడు. అతడు తెలిపిన ఈ విషయములను ప్రతియెక్కరు యథాతథముగా స్వీకరింప వలసి యున్నది. ఆ విధముగా మనుజుడు బుద్ధిమంతుడును, ఆధ్యాత్మికజ్ఞానము నందు పూర్ణుడును కాగలడు. అనగా దేవదేవుడైన శ్రీకృష్ణుని ఈ తత్త్వమును అవగాహనము చేసికొని, అతని భక్తియోగమున నిలుచుట ద్వారా ప్రతియొక్కరు త్రిగుణకల్మషము నుండి బయటపడగలరు. వాస్తవమునకు భక్తియోగమనునది ఆధ్యాత్మికావగాహన విధానము. భక్తియుక్తసేవ యున్న చోట భౌతికల్మషము నిలువలేదు. ఆధ్యాత్మికత్వమును కూడియుండుట వలన భక్తియుక్తసేవ మరియు భగవానుడు అనెడి అంశముల నడుమ భేదముండదు.
వాస్తవమునకు శుద్ధభక్తి శ్రీకృష్ణభగవానుని అంతరంగశక్తి యొక్క ఆధ్వర్యముననే జరుగును. భగవానుడు సూర్యుడైనచో అజ్ఞానము అంధకారము వంటిది. సూర్యుడున్నచోట అంధకారమనెడి ప్రశ్నయే ఉదయించనట్లు, ప్రామాణికుడగు ఆధ్యాత్మికగురువు నేతృత్వమున ఒనరింపబడు భక్తియుతసేవ యున్నచోట అజ్ఞానమనెడి ప్రశ్నయే కలుగదు. శ్రీమద్భగవద్గీత యందలి “పురుషోత్తమ యోగము” అను పంచదశాధ్యాయమునకు భక్తివేదాంతభాష్యము సమాప్తము.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 571 🌹
✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj
🌴 Chapter 15 - Purushothama Yoga - 20 🌴
20. iti guhya-tamaṁ śāstram idam uktaṁ mayānagha
etad buddhvā buddhimān syāt kṛta-kṛtyaś ca bhārata
🌷 Translation : This is the most confidential part of the Vedic scriptures, O sinless one, and it is disclosed now by Me. Whoever understands this will become wise, and his endeavors will know perfection.
🌹 Purport : The Lord clearly explains here that this is the substance of all revealed scriptures. And one should understand this as it is given by the Supreme Personality of Godhead. Thus one will become intelligent and perfect in transcendental knowledge. In other words, by understanding this philosophy of the Supreme Personality of Godhead and engaging in His transcendental service, everyone can become freed from all contaminations of the modes of material nature. Devotional service is a process of spiritual understanding.
Wherever devotional service exists, the material contamination cannot coexist. Devotional service to the Lord and the Lord Himself are one and the same because they are spiritual; devotional service takes place within the internal energy of the Supreme Lord. The Lord is said to be the sun, and ignorance is called darkness. Where the sun is present, there is no question of darkness. Therefore, whenever devotional service is present under the proper guidance of a bona fide spiritual master, there is no question of ignorance. Thus end the Bhaktivedanta Purports to the Fifteenth Chapter of the Śrīmad Bhagavad-gītā in the matter of Puruṣottama-yoga, the Yoga of the Supreme Person.
🌹 🌹 🌹 🌹 🌹
Comments