🌹. శ్రీమద్భగవద్గీత - 572 / Bhagavad-Gita - 572 🌹
✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 1 🌴
1. శ్రీ భగవానువాచ
అభయం సత్త్వసంశుద్దిర్ జ్ఞానయోగవ్యవస్థితి: |
దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవమ్ ||
🌷. తాత్పర్యం : శ్రీకృష్ణభగవానుడు పలికెను : ఓ భరతవంశీయుడా! భయరాహిత్యము, స్వీయస్థితి పవిత్రీకరణము, ఆధ్యాత్మికజ్ఞాన సముపార్జనము, దానగుణము, ఆత్మనిగ్రహము, యజ్ఞాచరణము, వేదాధ్యయనము, తపస్సు, సరళత్వము,
🌷. భాష్యము : కడచిన పంచదశాధ్యాయపు ఆరంభమున ఈ భౌతికజగత్తు యొక్క సంసారవృక్షము (ఆశ్వత్తవృక్షము) వర్ణింపబడినది. ఆ వృక్షము యొక్క అదనపు వ్రేళ్ళు శుభాశుభములుగా తెలియబడు జీవుల కర్మలతో పోల్చబడినవి. దైవీస్వభావము కలిగిన దేవతల గూర్చియు, అసురస్వభావము కలిగిన దానవుల గూర్చియు నవమాధ్యాయమున కూడా వర్ణింపబడినది.
ఇక ఇప్పుడు వేదముల ననుసరించి సత్త్వగుణకర్మలు ముక్తిపథమున పురోగమించుటకు దోహదములుగా భావించబడి “దైవీప్రకృతి” యని (స్వభావరీత్యా దివ్యములు) తెలియబడుచున్నది. అట్టి దివ్యస్వభావమున నిలిచినవారు ముక్తిమార్గమున నిశ్చయముగా పురోగతి సాధింపగలరు. కాని రజస్తమో గుణములందు వర్తించువారికి ఇందుకు భిన్నముగా ముక్తినొందు నవకాశమే లభింపదు. వారు మానవులుగా మర్త్యలోకమునందు నిలుచుటయో లేదా జంతుజాలమున జన్మించుటయో లేదా ఇంకను నీచమైన జన్మలను పొందుటయో జరుగును. ఈ షోడశాధ్యాయమున శ్రీకృష్ణభగవానుడు దైవీప్రకృతిని, దాని గుణములను, అలాగుననే ఆసురీప్రకృతిని, దాని గుణములను వర్ణించుచున్నాడు. ఈ దైవాసురగుణముల లాభనష్టములను సైతము భగవానుడు వివరింపనున్నాడు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 572 🌹
✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj
🌴 Chapter 16 - The Divine and Demoniac Natures - 1 🌴
1. śrī-bhagavān uvāca :
abhayaṁ sattva-saṁśuddhir jñāna-yoga-vyavasthitiḥ
dānaṁ damaś ca yajñaś ca svādhyāyas tapa ārjavam
🌷 Translation : The Supreme Personality of Godhead said: Fearlessness; purification of one’s existence; cultivation of spiritual knowledge; charity; self-control; performance of sacrifice; study of the Vedas; austerity; simplicity;
🌹 Purport : In the beginning of the Fifteenth Chapter, the banyan tree of this material world was explained. The extra roots coming out of it were compared to the activities of the living entities, some auspicious, some inauspicious. In the Ninth Chapter, also, the devas, or godly, and the asuras, the ungodly, or demons, were explained. Now, according to Vedic rites, activities in the mode of goodness are considered auspicious for progress on the path of liberation, and such activities are known as daivī prakṛti, transcendental by nature.
Those who are situated in the transcendental nature make progress on the path of liberation. For those who are acting in the modes of passion and ignorance, on the other hand, there is no possibility of liberation. Either they will have to remain in this material world as human beings, or they will descend among the species of animals or even lower life forms. In this Sixteenth Chapter the Lord explains both the transcendental nature and its attendant qualities and the demoniac nature and its qualities. He also explains the advantages and disadvantages of these qualities.
🌹 🌹 🌹 🌹 🌹
Comments