🌹. శ్రీమద్భగవద్గీత - 577 / Bhagavad-Gita - 577 🌹
✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 6 🌴
06. ద్వౌ భూతసర్గౌ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవ చ |
దైవో విస్తరశ: ప్రోక్త ఆసురం పార్థ మే శృణు ||
🌷. తాత్పర్యం : ఓ పృథాకుమారా! ఈ లోకమునందు దైవాసురలనెడి రెండురకముల జీవులు కలరు. దైవీగుణములను ఇదివరకే నేను వివరముగా తెలిపియుంటిని. ఇక ఆసురస్వభావము గలవారి గుణములను నా నుండి ఆలకింపుము.
🌷. భాష్యము : అర్జునుడు దైవీగుణములతో జన్మించినాడని పలుకుచు అతనికి ధైర్యమును గొలిపిన శ్రీకృష్ణభగవానుడు ఇక ఆసురీగుణములను వివరింప ఉద్యుక్తుడగుచున్నాడు. జగమునందు బద్ధజీవులు రెండు తరగతులుగా విభజింపబడియుందురు. అందు దైవీగుణములతో జన్మించినవారు నియమబద్ధమైన జీవితమును గడుపుదురు. అనగా వారు శాస్త్రవిధులకు మరియు ప్రామాణికులైనవారి ఉపదేశములకు కట్టుబడియుందురు. వాస్తవమునకు ప్రతియొక్కరు ఈ విధముగనే ప్రామాణిక శాస్త్రాధారముగా తమ ధర్మమును నిర్వర్తించ వలయును. ఇట్టి స్వభావమే దైవీస్వభావమన బడును.
అట్లుగాక శాస్త్రనియమములను పాటింపక కేవలము తనకు తోచిన రీతిగా వర్తించువాడు దానవస్వభావము (ఆసురప్రవృత్తి) కలవాడని పిలువబడును. అనగా శాస్త్రమునందు తెలియజేయబడిన విధి నియమములను పాటించుట తప్ప దైవీసంపదకు వేరొక్క ప్రమాణము లేదు. దేవదానవులు ఇరువురును ప్రజాపతి నుండియే జన్మించిరి వేదవాజ్మయము తెలుపుచున్నది. కాని వారివురి నడుమ భేదమేమనగా ఒక తరగతివారు వేదవిధులను ఆమోదించగా, ఇంకొకరు వానిని ఆమోదించరు.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 577 🌹
✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj
🌴 Chapter 16 - The Divine and Demoniac Natures - 06 🌴
06. dvau bhūta-sargau loke ’smin daiva āsura eva ca
daivo vistaraśaḥ prokta āsuraṁ pārtha me śṛṇu
🌷 Translation : O son of Pṛthā, in this world there are two kinds of created beings. One is called divine and the other demoniac. I have already explained to you at length the divine qualities. Now hear from Me of the demoniac.
🌹 Purport : Lord Kṛṣṇa, having assured Arjuna that he was born with the divine qualities, is now describing the demoniac way. The conditioned living entities are divided into two classes in this world. Those who are born with divine qualities follow a regulated life; that is to say they abide by the injunctions in scriptures and by the authorities. One should perform duties in the light of authoritative scripture.
This mentality is called divine. One who does not follow the regulative principles as they are laid down in the scriptures and who acts according to his whims is called demoniac or asuric. There is no other criterion but obedience to the regulative principles of scriptures. It is mentioned in Vedic literature that both the demigods and the demons are born of the Prajāpati; the only difference is that one class obeys the Vedic injunctions and the other does not.
🌹 🌹 🌹 🌹 🌹
Comments