top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీమద్భగవద్గీత - 581: 16వ అధ్., శ్లో 10 / Bhagavad-Gita - 581: Chap. 16, Ver. 10



🌹. శ్రీమద్భగవద్గీత - 581 / Bhagavad-Gita - 581 🌹


✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 10 🌴


10. కామమాశ్రిత్య దుష్పూరం దంభమాన మదాన్వితా: |

మోహాద్ గృహీత్వాసద్గ్రాహాన్ ప్రవర్తన్తేశుచివ్రతా: ||


🌷. తాత్పర్యం : పూరింప శక్యము కానటువంటి కామము నాశ్రయించి గర్వము మరియు మిథ్యాహంకారములను కూడినవారై భ్రాంతినొందినటువంటి ఆసురస్వభావులు ఆశాశ్వతములైనవాని యెడ ఆకర్షితులై సదా అపవిత్ర వ్రతులగుదురు.


🌷. భాష్యము : ఆసురస్వభావము గలవారి మనస్తత్వము ఇచ్చట వర్ణింపబడుచున్నది. వారి కామవాంఛకు తృప్తియన్నది ఉండదు. తృప్తినెరుగని విషయభోగానుభవ కోరికలను వారు సదా వృద్ధిచేసికొనుచుందురు. అశాశ్వతములైనవాటిని ఆంగీకరించుటచే కలుగు దుఃఖములందు పూర్తిగా మునిగియున్నను, మాయాకారణముగా వారు అట్టి కార్యములందే నిమగ్నులై యుందురు. జ్ఞానరహితములైన అట్టివారు తాము తప్పుమార్గమున చనుచున్నామని ఎరుగలేరు. అశాశ్వతవిషయముల నంగీకరించుచు అట్టి అసురస్వభావులు తమకు తామే ఒకే దేవుడని మరియు మంత్రములను సృష్టించుకొని జపకీర్తనములను గావింతురు.


తత్ఫలితముగా వారు మైథునభోగము మరియు ధనమును కూడబెట్టుట యనెడి విషయముల యెడ మిగుల ఆకర్షితులగుదురు. “అశుచివ్రతా:” యను పదము ఈ సందర్భమున అతి ముఖ్యమైనది. అనగా అసురస్వభావులు మగువ, మదిర, జూదము, మాంసభక్షణములకు సంపూర్ణముగా ఆకర్షితులై యుందురు. అవియే వారి అశుచియైన అలవాట్లు. గర్వము మరియు మిథ్యాహంకారములచే ప్రభావితులై అట్టివారు వేదములచే ఆమోదయోగ్యములు గాని కొన్ని ధర్మనియమములను సృష్టించుకొందురు. అట్టివారు వాస్తవమునకు ప్రపంచమునందు అత్యంత అధములైనను జనులు వారికి కృత్రిమముగా మిథ్యాగౌరవమును కల్పింతురు. అసురస్వభావులైన అట్టివారు నరకమునకు దిగజారుచున్నను తమను తాము పురోభివృద్ది నొందినవారుగా భావింతురు.


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Bhagavad-Gita as It is - 581 🌹


✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj


🌴 Chapter 16 - The Divine and Demoniac Natures - 10 🌴


10. kāmam āśritya duṣpūraṁ dambha-māna-madānvitāḥ

mohād gṛhītvāsad-grāhān pravartante ’śuci-vratāḥ


🌷 Translation : Taking shelter of insatiable lust and absorbed in the conceit of pride and false prestige, the demoniac, thus illusioned, are always sworn to unclean work, attracted by the impermanent.


🌹 Purport : The demoniac mentality is described here. The demons have no satiation for their lust. They will go on increasing and increasing their insatiable desires for material enjoyment. Although they are always full of anxieties on account of accepting nonpermanent things, they still continue to engage in such activities out of illusion. They have no knowledge and cannot tell that they are heading the wrong way. Accepting nonpermanent things, such demoniac people create their own God, create their own hymns and chant accordingly. The result is that they become more and more attracted to two things – sex enjoyment and accumulation of material wealth.


The word aśuci-vratāḥ, “unclean vows,” is very significant in this connection. Such demoniac people are only attracted by wine, women, gambling and meat-eating; those are their aśuci, unclean habits. Induced by pride and false prestige, they create some principles of religion which are not approved by the Vedic injunctions. Although such demoniac people are most abominable in the world, by artificial means the world creates a false honor for them. Although they are gliding toward hell, they consider themselves very much advanced.


🌹 🌹 🌹 🌹 🌹


0 views0 comments

コメント


bottom of page