top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీమద్భగవద్గీత - 582: 16వ అధ్., శ్లో 11 / Bhagavad-Gita - 582: Chap. 16, Ver. 11

 



🌹. శ్రీమద్భగవద్గీత - 582 / Bhagavad-Gita - 582 🌹


✍️. శ్రీ ప్రభుపాద,. 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 11 🌴


11. చిన్తామపరిమేయాం చ ప్రలయాన్తాముపాశ్రితా: |

కామోపభోగపరమా ఏతావదితి నిశ్చితా: ||


🌷. తాత్పర్యం : ఇంద్రియతృప్తియే మానవుల ముఖ్యావసరమని వారు విశ్వసింతురు. ఆ విధముగా జీవితాంతము వరకును వారి దుఃఖము అపరిమితముగా నుండును.


🌷. భాష్యము : అసురస్వభావులు ఇంద్రియభోగమునే జీవితలక్ష్యముగా అంగీకరింతురు. ఆ భావననే వారు మరణము వరకు కొనసాగింతురు. మరణము పిదప వేరొక జన్మమున్నదని గాని, కర్మానుసారము జీవుడు వివిధదేహములను పొందవలసివచ్చునని గాని వారు విశ్వసింపరు. వారి జీవనప్రణాళికలు ఎన్నడును పూర్తికావు. ఒక ప్రణాళిక పిదప వేరొక ప్రణాళికను తయారు చేయుచు పోయెడి వారి ప్రణాళికలు ఎన్నడును పూర్తి కావు. అట్టి అసురస్వభావము కలిగిన మనుజుని అనుభవము నాకు గలదు.


మృత్యుశయ్యపై నున్న అతడు తన ప్రణాళికలు ఇంకను పూర్తికాలేదనియు తత్కారణముగా తన ఆయువును కనీసము నాలుగేళ్ళు పొడిగింపుమనియు వైద్యుని ప్రార్థించెను. వైద్యుడు జీవితమును క్షణకాలమును కూడా పొడిగించలేడని అట్టి మూర్ఖులు ఎరగజాలరు. మరణము యొక్క పిలుపు రాగానే మనుజుని కోరికలను పట్టించుకొనుట జరుగదు. మనుజుని ఆయువు విషయమున నియమిత సమయము కంటె ఒక్క క్షణమును సైతము ప్రకృతి నియమములు అంగీకరింపవు.


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Bhagavad-Gita as It is - 582 🌹


✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj


🌴 Chapter 16 - The Divine and Demoniac Natures - 11 🌴


11. cintām aparimeyāṁ ca pralayāntām upāśritāḥ

kāmopabhoga-paramā etāvad iti niścitāḥ


🌷 Translation : They believe that to gratify the senses is the prime necessity of human civilization. Thus until the end of life their anxiety is immeasurable.


🌹 Purport : The demoniac accept that the enjoyment of the senses is the ultimate goal of life, and this concept they maintain until death. They do not believe in life after death, and they do not believe that one takes on different types of bodies according to one’s karma, or activities in this world. Their plans for life are never finished, and they go on preparing plan after plan, all of which are never finished.


We have personal experience of a person of such demoniac mentality who, even at the point of death, was requesting the physician to prolong his life for four years more because his plans were not yet complete. Such foolish people do not know that a physician cannot prolong life even for a moment. When the notice is there, there is no consideration of the man’s desire. The laws of nature do not allow a second beyond what one is destined to enjoy.


🌹 🌹 🌹 🌹 🌹


0 views0 comments

Comentarios


bottom of page