🌹. శ్రీమద్భగవద్గీత - 591 / Bhagavad-Gita - 591 🌹
✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 20 🌴
20. ఆసురీం యోనిమాపన్నా మూఢా జన్మని జన్మని |
మామప్రాప్యైవ కౌన్తేయ తతో యాన్త్యధమాం గతిమ్ ||
🌷. తాత్పర్యం : ఓ కొన్తేయా! అసుర యోనుల యందే మరల మరల జన్మించి అట్టివారు నన్నెన్నడును పొందజాలక క్రమముగా అతి హేయమైన జన్మలకు పతనము నొందుదురు.
🌷. భాష్యము : భగవానుడు పరమకరుణా మయుడనెడి విషయము తెలిసినదే. కాని అతడు అసురస్వభావము గలవారి యెడ మాత్రము ఎన్నడును దయాస్వభావమును చూపడని ఈ శ్లోకమున మనము గాంచుచున్నాము. అసురస్వభావులు ప్రతిజన్మ యందును అవే అసురయోనుల యందు ఉంచబడుదురనియు, భగవానుని కరుణను పొందజాలక వారు పతనము నొందుదురనియు స్పష్టముగా తెలుపబడినది. ఆ విధముగా వారు చివరకు శునక, సూకర, మార్జాలముల వంటి హేయజన్మలను పొందుదురు.
అట్టి దానవస్వభావులు తరువాతి జన్మలో ఎట్టి స్థితి యందును భగవత్కరుణను పొందు అవకాశమే లేదని ఇచ్చట స్పష్టముగా వివరింపబడినది. అట్టివారు క్రమముగా పతనము నొంది శునక, సూకరములుగా జన్మింతురని వేదములందు తెలుపబడినది. భగవానుడు దానవస్వభావుల యెడ దయాళువు కానిచో అతనిని దయాపూర్ణుడని ప్రకటించరాదు కదాయని ఎవరైనను వాదించు నవకాశము కలదు. అట్టి ప్రశ్నకు సమాధానముగా పరమపురుషుడు ఎవ్వరియెడను ద్వేషమును కలిగియుండడని వేదాంత సూత్రము లందు మనము గాంచవచ్చును. అనగా అసురస్వభావులను అతి నీచజన్మల యందు పడద్రోయుట యనునది ఆ భగవానుని కరుణకు వేరొకరూపమై యున్నది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 591 🌹
✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj
🌴 Chapter 16 - The Divine and Demoniac Natures - 20 🌴
20. āsurīṁ yonim āpannā mūḍhā janmani janmani
mām aprāpyaiva kaunteya tato yānty adhamāṁ gatim
🌷 Translation : Attaining repeated birth amongst the species of demoniac life, O son of Kuntī, such persons can never approach Me. Gradually they sink down to the most abominable type of existence.
🌹 Purport : It is known that God is all-merciful, but here we find that God is never merciful to the demoniac. It is clearly stated that the demoniac people, life after life, are put into the wombs of similar demons, and, not achieving the mercy of the Supreme Lord, they go down and down, so that at last they achieve bodies like those of cats, dogs and hogs. It is clearly stated that such demons have practically no chance of receiving the mercy of God at any stage of later life.
In the Vedas also it is stated that such persons gradually sink to become dogs and hogs. It may be then argued in this connection that God should not be advertised as all-merciful if He is not merciful to such demons. In answer to this question, in the Vedānta-sūtra we find that the Supreme Lord has no hatred for anyone. The placing of the asuras, the demons, in the lowest status of life is simply another feature of His mercy. Sometimes the asuras are killed by the Supreme Lord, but this killing is also good for them, for in Vedic literature we find that anyone who is killed by the Supreme Lord becomes liberated. There are instances in history of many asuras – Rāvaṇa, Kaṁsa, Hiraṇyakaśipu – to whom the Lord appeared in various incarnations just to kill them. Therefore God’s mercy is shown to the asuras if they are fortunate enough to be killed by Him.
🌹 🌹 🌹 🌹 🌹
Comments