🌹 . శ్రీ శివ మహా పురాణము - 803 / Sri Siva Maha Purana - 803 🌹
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 23 🌴
🌻. పాతివ్రత్య భంగము - 1 🌻
వ్యాసుడిట్లు పలికెను -
ఓ సనత్కుమారా! సర్వజ్ఞా! నీవు వక్తలలో శ్రేష్టుడవు. అచట విష్ణువు ఏమి చేసెను? ఆమె ధర్మమునెట్లు విడిచిపెట్టెను? చెప్పుము (1).
సనత్కుమారుడిట్లు పలికెను - విష్ణువు జలంధరాసురుని పురములో ప్రవేశించి బృందయొక్క పాతివ్రత్యమును చెడగొట్టుటకు నిశ్చయించెను (2). మాయావులలో శ్రేష్ఠుడుగు ఆ విష్ణువు అద్భుతమగు రూపమును దాల్చి ఆ నగరము యొక్క ఉద్యానవనములో స్వయముగా మకాముచేసి బృంద ఒక స్వప్నమును గనునట్లు చేసెను (3). అపుడు జలంధరుని భార్య, గొప్ప వ్రతము గలది అగు ఆ బృందాదేవి విష్ణువుయొక్క మాయాప్రభావముచే రాత్రియందు చెడుకలను గనెను (4). ఆమె విష్ణుమాయచే స్వప్న మధ్యములో దున్నను ఆరోహించిన వాడు, నూనె రాసుకొని దిగంబరముగా నున్న వాడు, నల్లని పుష్పములను అలంకారముగా ధరించి యున్నవాడు, రాక్షసగణములచే సేవింపబడు చున్నవాడు, తల గొరిగించుకొని దక్షిణ దిక్కునకు వెళ్లుచున్నవాడు, ఆ సమయములో చీకటిచే ఆవరింపబడినవాడు అగు తన భర్తను గాంచెను (5, 6).
ఆ నగరము తనతో సహా సముద్రములో మునిగి పోయినట్లు వెంటనే ఆ కలలో ఆమెకు కన్పట్టెను. ఆమె తెల్లవారు సమయములో ఇట్టి అనేక దుస్స్వప్నములను గాంచెను (7). ఆ అమాయకురాలు అపుడు నిద్రలేచి ఆ కలను గురించి తలపోయుచుండగనే ఉదయించుచున్న సూర్యుని గాంచెను. ఆ సూర్యమండలములో మధ్యలో ఛిద్రము కానవచ్చెను. మరియు సూర్యుడు అనేకపర్యాయములు వెలవెల బోవుచుండెను. (8).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 803 🌹
✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 23 🌴
🌻 Outraging the modesty of Vṛndā - 1 🌻
Vyāsa said:—
1. O omniscient Sanatkumāra, please narrate, O eloquent one, what did Viṣṇu do there? How did she err from her virtue?
Sanatkumāra said:—
2. After going to the city of Jalandhara, Viṣṇu thought of violating the chastity of Vṛndā.
3. The foremost among those who wield illusion, he assumed a wonderful body and stationed himself in a park of the city. He made Vṛndā see a dream.
4. The gentle lady Vṛndā, the wife of Jalandhara, though of pure rites, had a very bad dream at night on account of Viṣṇu’s power of illusion.
5. In the dream as a result of Viṣṇu’s power of illusion she saw the naked form of her husband anointed with oil and seated on a buffalo.
6. He was proceeding in the southern direction. His head had been completely shaved. He was wearing black flowers to decorate himself. He was being served by a number of Asuras. He was completely encompassed by darkness.
7. Later, towards the end of the night she had various bad dreams, such as the whole city was submerged in the sea, all of a sudden, along with herself.
8. Then the lady woke up still thinking of the dream she had had. She saw the rising sun with a hole in the middle and fading repeatedly.
Continues....
🌹🌹🌹🌹🌹
Comments