top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ శివ మహా పురాణము - 805 / Sri Siva Maha Purana - 805


🌹 . శ్రీ శివ మహా పురాణము - 805 / Sri Siva Maha Purana - 805 🌹


✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 23 🌴


🌻. పాతివ్రత్య భంగము - 3 🌻


బృంద ఇట్లు పలికెను - ఓ మహర్షీ! దయాసముద్రా! ఇతరుల దుఃఖమును పోగొట్టువాడా! ఈ దుష్టులు కలిగించిన ఘోర భయమునుండి నీవు నన్ను రక్షించితివి (18). ఓ దయానిధీ! నీవు అన్ని విధములుగా సమర్థుడవు ; సర్వజ్ఞుడవు. నేను నీకు ఒక విన్నపమును చేసెదును. దయతో వినుము (19). ఓ ప్రభూ! నా భర్తయగు జలంధరుడు రుద్రునితో యుద్ధమును చేయుటకు వెళ్లినాడు. ఓ గొప్ప వ్రతము గలవాడా! ఆతడు అచట యుద్ధములో ఎట్లు ఉన్నాడో నాకు చెప్పుము (20).


సనత్కుమారుడిట్లు పలికెను- ఆ ముని ఆమె మాటలను విని కపట మౌనమును దాల్చెను. తన స్వార్థమును సాధించే ఉపాయములలో దిట్టయగు ఆతడు దయతో పైకి చూచెను (21). వెంటనే రెండు గొప్ప కోతులు వచ్చి ఆతనికి నమస్కరించి ఎదుట నిలబడెను. అవి ఆతని కనుబొమల కదలిక ద్వారా ఈయబడిన ఆజ్ఞను స్వీకరించి ఆకసమునకు ఎగిరినవి (22). అవి అర్ధక్షణకాలము గడిచిన తరువాత మరల వచ్చి ఆతని ఎదుట నిలబడెను. ఓ మహర్షీ! అవి జలంధరుని మొండెమును, తలను, చేతులను తీసుకొని వచ్చెను (23). సముద్రపుత్రుడగు జలంధరుని ఆ శిరస్సును, మొండెమును, చేతులను గాంచి ఆమె భర్త మరణముచే దుఃఖితురాలై మూర్ఛిల్లి నేలపై కూలబడెను (24). బృంద ఇట్లు పలికెను- ఓ ప్రభూ! పూర్వము నీవు సుఖకరమగు సల్లాపముతో నాకు వినోదమును కలిగించెడివాడవు. నిర్దోషిని, ప్రియురాలను అగు నాతో నీవు ఇపుడు ఏల మాటలాడుట లేదు? (25) దేవతలను, గంధర్వులను, విష్ణువును కూడ జయించిన, త్రిలోకవిజేతయగు ఆ జలంధరుడు ఈ నాడు ఒక తాపసిచే ఎట్లు సంహరింపబడినవాడు? (26).




సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹






🌹 SRI SIVA MAHA PURANA - 805 🌹


✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj


🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 23 🌴


🌻 Outraging the modesty of Vṛndā - 3 🌻



Vṛndā said:—


18. “O leader of sages, O ocean of mercy, O remover of harassment from others, I have been saved by you from this terrible danger from the wicked demons.


19. You are competent in every respect. You are omniscient. Yet I wish to submit something. Be pleased to hear it.


20. O lord, Jalandhara my husband has gone to fight Śiva. O holy one of good rites, how does he fare in the war? Please tell me.”



Sanatkumāra said:—


21. On hearing her words, the sage feigned a deceptive silence. Fully aware of the means of achieving his selfish ends he looked up sympathetically.


22. In the meantime two lordly monkeys came there and stood bowing down in front of him. At a significant gesture from his eyebrows, the monkeys rose into the sky again.


23. O great sage, within a trice, they came back taking with them his head, body and limbs and stood in front of the sage.


24. On seeing the head, body and limbs of her husband, Vṛndā fell unconscious, extremely pained at the misery of her lord.



Vṛndā said:—


25. “O lord, formerly you used to humour me with pleasant chats. How is it that you do not speak to me now, to your pious beloved?


26. How is it that you, by whom all the gods including the Gandharvas and Viṣṇu had been defeated, you who had conquered the three worlds, have now been killed by a poor sage?




Continues....


🌹🌹🌹🌹🌹




1 view0 comments

Comentarios


bottom of page