🌹 . శ్రీ శివ మహా పురాణము - 808 / Sri Siva Maha Purana - 808 🌹
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 23 🌴
🌻. పాతివ్రత్య భంగము - 6 🌻
నీవు నీ అనుచరులనిద్దరిని మాయచే నా యెదుట ప్రవేశ##పెడితివి. వారిద్దరు రాక్షసులై నీ భార్యను అపహరించగలరు (44). నీవు భార్యావియోగదుఃఖ పీడితుడవై కోతుల సాహాయ్యమును పొంది అడవులలో తిరుగాడుము. నీ శిష్యుని వలె నటించిన ఈ శేషుడు నీకు తోడు కాగలడు (45). ఆమె యొక్క చిరునవ్వునందు ఆసక్తి గల మనస్సుతో గూడిన విష్ణువు వారించుచున్ననూ లెక్క చేయకుండగా, ఆ బృంద అపుడు ఇట్లు పలికి, అగ్నిలో ప్రవెశించెను (46) ఓ మునీ! ఆ సమయములో బ్రహ్మాదిదేవతలందరు భార్యలతో గూడి బృంద సద్గతిని పొందుటను చూడగోరి ఆకసమునందు వచ్చి యుండిరి (47). అపుడు జలంధరపత్ని యొక్క సర్వోత్కృష్టమైన ఆ మహాతేజస్సు దేవతలందరు చూచు చుండగా శీఘ్రముగా శివలోకమును చేరెను (48).
ఆ బృందయొక్క తేజస్సు పార్వతీదేవియొక్క దేహములో కలిసి పోయెను. ఆకాశమునందున్న దేవతల వరుసలలో జయజయధ్వనులు చెలరేగెను (49). ఈ విధముగా మహారాణి, కాలనేమి కుమార్తె, ఉత్తమురాలు అగు బృంద పాతివ్రత్యమహిమచే పరమముక్తిని పొందెను. ఓ మునీ! (50) అపుడు విష్ణువు బృందయొక్క చితాభస్మను ముఖమునందు దాల్చి ఆమెను పలుపర్యాయములు స్మరిస్తూ అచటనే ఉండెను. దేవతాగణములు, సిద్ధగణములు బోధించిననూ ఆయన శాంతిని పొందలేదు (51).
శ్రీ శివమహాపురాణములోని రుద్రసంహితలోని యుద్ధఖండములో బృందపాతివ్రత్య భంగవర్ణనమనే ఇరువది మూడవ అధ్యాయము ముగిసినది (23).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 808 🌹
✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 23 🌴
🌻 Outraging the modesty of Vṛndā - 6 🌻
44. The two persons whom you made to appear in front of me shall become Rākṣasas[1] and abduct your wife.
45. You will be distressed on account of separation from your wife roaming about with Śeṣa ‘lord of snakes’[2] who posed as your disciple here. You will seek the help of monkeys[3] in the forest.
46. After saying this, Vṛndā entered fire though prevented by Viṣṇu who was fascinated by her charms.
47. O sage, then Brahmā and other gods, gathered in the sky accompanied by their wives in order to see the salvation of Vṛndā.
48. Then the great brilliance of the wife of Jalandhara immediately went to Śivaloka even as the gods stood watching.
49. The refulgence of Vṛndā became merged in Pārvatī. There was a great shout of “Victory” in the rows of the gods standing in the sky.
50. O sage, thus the great queen Vṛndā the excellent daughter of Kālanemi attained great salvation, thanks to the power of her chastity.
51. Viṣṇu thought of Vṛndā remorsefully. The smoke and dust from her funeral pyre covered his face. He stood there itself without any peace of mind though urged and consoled by hosts of gods and Siddhas.
Continues....
🌹🌹🌹🌹🌹
Comments