top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ శివ మహా పురాణము - 817 / Sri Siva Maha Purana - 817


🌹 . శ్రీ శివ మహా పురాణము - 817 / Sri Siva Maha Purana - 817 🌹


✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 25 🌴


🌻. దేవతలు శివుని స్తుతించుట - 3 🌻


ఓ మహాప్రభూ! నీ భక్తియందు స్థిరముగా నున్న శుచివ్రతుడను బ్రాహ్మణునకు ఆతని తల్లితో సహా దయతో జ్ఞానమునిచ్చి ఆతని దారిద్ర్యమును తొలగించితివి (16). చిత్రవర్మమహారాజు నీయందలి భక్తిచే ఇహలోకములో సర్వదా దేవతలకు కూడ లభింప శక్యము కాని భోగముల ననుభవించి సద్గతిని పొందెను (17). చంద్రాంగదుడనే రాజకుమారుడు తన భార్యయగు సీమంతినితో గూడి సకలదుఃఖములనుండి విముక్తుడై సుఖములను, ఉత్తమ గతిని పొందెను (18)


ఓ శివా! వేశ్యతో తిరుగువాడు, దుష్టుడు, అధముడు అగు మందరుడనే బ్రాహ్మణుడు కూడ నీ భక్తుడై నిన్ను చక్కగా పూజించి ఆమెతో సహా సద్గతిని పొందినాడు (19). భద్రాయుడనే రాజకుమారుడు నీ భక్తుని దయచే, మరియు నీదయచే దుఃఖవినిర్ముక్తుడై తల్లితో గూడి సుఖములను పొంది పరమపదమును చేరినాడు. హే ప్రభూ! (20).


మహేశ్వరా! స్త్రీలందరితో భోగమునందాసక్తి గలవాడు, సర్వదా తినకూడని పదార్థములను తినువాడు నగు దుష్టుడు కూడ నిన్ను సేవించి మోక్షమును పొందెను (21). ఓ శంభూ! శంకర భక్తుడు, సర్వదా విభూతిని దాల్చువాడు నగు శంబరుడు విభూతి ధారణ నియమమువలన తన భార్యతో గూడి నీ పురమును చేరినాడు (22).



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹





🌹 SRI SIVA MAHA PURANA - 817 🌹


✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj


🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 25 🌴


🌻 Prayer by the gods - 3 🌻



16. O great lord, mercifully you made the brahmin Śucivrata strictly adhering to devotion to you gain knowledge along with his mother and made him rich too.


17. By his devotion to you the excellent king Citravarman perpetually enjoyed in this world the pleasures inaccessible even to the gods and attained salvation, the goal of the good.


18. The prince Candrāṅgada along with his wife Sīmantinī got rid of all miseries, enjoyed happiness and attained great goal.


19. The brahmin named Mandara who became a base knave indulging in lecherous association with prostitutes, O Śiva, worshipped one of your women devotees and attained salvation along with her.


20. O lord, thanks to the favour of a devotee of yours, the prince Bhadrāyu attained happiness free from pain and achieved great goal along with his mother.


21. O lord Śiva, even wicked sinners eating forbidden foodstuffs and indulging in sexual dalliance with all sorts of women, have been liberated by their service to you.


22. O Śiva, Śambara a devotee of yours, smearing himself with the ashes of the funeral pyre, attained your region along with his wife, thanks to his regular adherence to Bhasma.



Continues....


🌹🌹🌹🌹🌹






1 view0 comments

Comments


bottom of page