top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ శివ మహా పురాణము - 818 / Sri Siva Maha Purana - 818


🌹 . శ్రీ శివ మహా పురాణము - 818 / Sri Siva Maha Purana - 818 🌹


✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 25 🌴


🌻. దేవతలు శివుని స్తుతించుట - 4 🌻


సనత్కుమారుడిట్లు పలికెను- ఆ బ్రహ్మాది దేవతలు మహర్షులతో గూడి ఇట్లు స్తుతించి శివుని పాదములపై లగ్నమైన మనస్సులు గలవారై అపుడు మిన్నకుండిరి (32). అపుడు మహేశ్వరుడగు శంభుప్రభుడు పవిత్రమగు దేవతల స్తుతిని విని శ్రేష్ఠమగు వరములనిచ్చి వెంటనే అచటనే అంతర్హితుడాయెను (33). బ్రహ్మ మొదలగు దేవతలందరు కూడ శత్రువులు నశించుటచే ఆనందించిన వారై శివుని సత్కీర్తిని ప్రేమతో గానము చేయుచూ తమ తమ స్థానములకు వెళ్లిరి (34).


మహేశ్వరుడు జలంధరుని సంహరించుట అనే ఈ గొప్ప గాథ పవిత్రమైనది, మరియు మహాపాపములను నశింపచేయునది (35). ఈ పవిత్రమగు దేవతల స్తుతి పాపములనన్నిటినీ పోగొట్టి నిత్యము సర్వసుఖముల నిచ్చును. ఈ స్తుతి మహేశునకు ఆనందమును కలిగించును (36). ఈ రెండు గాథలను ఎవరు పఠించెదరో, లేదా పఠింపజేసెదరో వారు ఇహలోకములో గొప్ప సుఖమునను భవించి గణాధ్యక్షస్థానమును పొందెదరు (37).


శ్రీ శివమహాపురాణములోని రుద్రసంహితయందు యుద్ధఖండములో దేవస్తుతి వర్ణనమనే ఇరువది అయిదవ అధ్యాయము ముగిసినది (25).



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹





🌹 SRI SIVA MAHA PURANA - 818 🌹


✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj


🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 25 🌴


🌻 Prayer by the gods - 4 🌻



Sanatkumāra said:—


32. After eulogising Brahmā, other gods and the great sages, the gods remained silent with their minds fixed on Śiva’s feet.


33. The great lord Śiva heard the auspicious prayer of the gods, conferred boons on them and then vanished immediately from the scene.


34. Brahmā and other gods were jubilant as the enemies had been killed. Delightfully singing the great glory of Śiva, they left for their own abodes.


35. This great narrative describing the suppression of Jalandhara is a sanctifying story of lord Śiva that destroys all sins.


36. This prayer of the gods is holy and destructive of sins. It bestows happiness on the devotees and is delightful to Śiva.


37. He who reads or teaches the two narratives, enjoys great happiness here and becomes the lord of Gaṇas hereafter.




Continues....


🌹🌹🌹🌹🌹




1 view0 comments

Comments


bottom of page