top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ శివ మహా పురాణము - 821 / Sri Siva Maha Purana - 821


🌹 . శ్రీ శివ మహా పురాణము - 821 / Sri Siva Maha Purana - 821 🌹


✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 26 🌴


🌻. విష్ణువు యొక్క మోహమును తొలగించుట - 3 🌻



మూల ప్రకృతియని పిలువబడు ఆ మాయ పర్వతరాజు పుత్రికయై ఉమా మహాదేవి యను పేరుతో ఆనందమును కలుగ జేయు చున్నది. ఆ పరామయాయే త్రిమూర్తులకు తల్లి (16). ఓ దేవతలారా! శరణు పొందదగినది, మోహింపజేయునది, శివా యను పేరు గలది, కోర్కెలనన్నిటినీ ఈ డేర్చునది అగు ఆ మాయను విష్ణువుయొక్క మోహమును పోగొట్టుట కొరకై శరణు పొందుడు (17). నా శక్తికి సంతోషమును కలిగించే స్తుతిని చేయుడు. ఆమె ప్రసన్నురాలైనచో కార్యమునంతనూ చక్కబెట్టగలదు (18).


సనత్కుమారుడిట్లు పలికెను- ఓ వ్యాసా! పంచముఖుడు, పాపహారియగు శంభు భగవానుడు ఆ దేవతలతో నిట్లు పలికి గణములందరితో గూడి అంతర్ధానము జెందెను (19). బ్రహ్మ, ఇంద్రుడు మొదలగు దేవతలు శంభుని శాసనముచే భక్తవత్సలురాలగు మూలప్రకృతిని మనస్సులో స్తుతించిరి (20).


దేవతలిట్లు పలికిరి - దేవినుండి సత్త్వరజస్తమోగుణములు పుట్టినవో, ఏది సృష్టిస్థితిలయములను కర్మలను అనుష్ఠించుచున్నదో, దేవి సంకల్పము చే ఈ జగత్తు జన్మమరణములను పొందుచున్నదో, అట్టి మూలప్రకృతికి నమస్కరించుచున్నాము (21). సంపూర్ణమగు జగత్తునందు స్పష్టముగా పరిగణించి ప్రకటింపబడిన ఇరువది మూడు గుణములను అధిష్ఠించి యున్న పరాశక్తి మమ్ములను రక్షించుగాక! ముల్లోకములలో దేని యొక్క రూపమును మరియు కర్మలను జనులు ఎరుంగరో అట్టి మూలప్రకృతిని నమస్కరించుచున్నాము (22). దేనియందు భక్తి గల పురుషులుసర్వదా దారిద్ర్యము, అజ్ఞానము, జన్మ మరణములను నిశ్చితముగా పొందరో, అట్టి భక్తవత్సలయగు మూలప్రకృతిని సర్వదా నమస్కరించుచున్నాము (23).



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹





🌹 SRI SIVA MAHA PURANA - 821 🌹


✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj


🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 26 🌴


🌻 The Vanishing of Viṣṇu’s delusion - 3 🌻

16. That illusion is given various names: Umā, Mahādevī, the mother of the three deities, the greatest, primordial Mūlaprakṛti and the lovely woman Pārvatī. 17. O gods, seek refuge in that fascinating goddess named illusion, for the removal of Viṣṇu’s delusion. She is the bestower of cherished desires and worthy of being sought refuge in. 18. Sing the eulogy that satisfies my Śakti. If she is delighted, she will carry out your tasks. Sanatkumāra said:— 19. O Vyāsa, after saying this to the gods, the five-faced lord Śiva vanished suddenly along with his Gaṇas. 20. At the bidding of Śiva, Brahmā and other gods including Indra mentally eulogised to the primordial Prakṛti favourably disposed to her devotees. The gods said:— 21. We bow to the primordial Prakṛti from which emanate the three attributes Sattva, Rajas and Tamas that cause creation, sustenance and annihilation, and by whose desire the universe is evolved and dissolved. 22. May the great illusion save us, the great Prakṛti that presides over the twentythree principles,[1] well enunciated in the universe. We bow to the primordial Prakṛti whose forms and activities are not known to the three worlds. 23. We bow to the primordial Prakṛti favourably disposed to the devotees. Persons endowed with devotion to her are not bedevilled by poverty, delusion and destruction. Continues.... 🌹🌹🌹🌹🌹



1 view0 comments

Comentários


bottom of page