top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ శివ మహా పురాణము - 822 / Sri Siva Maha Purana - 822


🌹 . శ్రీ శివ మహా పురాణము - 822 / Sri Siva Maha Purana - 822 🌹


✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 26 🌴


🌻. విష్ణువు యొక్క మోహమును తొలగించుట - 4 🌻


ఓ మహాదేవీ! పరమేశ్వరీ ! మా కార్యమును చక్కబెట్టుము. ఓ శివా! దుర్గాదేవీ! విష్ణువు యొక్క మోహమును తొలగించుము. నీకు నమస్కారమగు గాక! (24) ఓ శివా! కైలాసవాసియగు శంభునకు, జలంధరునకు యుద్ధము జరుగుచుండగా, గౌరీ దేవియొక్క ఆజ్ఞను పొంది వాని వధకొరకై (25) విష్ణువు ప్రయత్నపూర్వకముగా బృందను మోహింపజేసినాడు. ఆమె తన ధర్మమును నిలబెట్టుకొని అగ్నిలో దేహత్యాగమును చేసి పరమ గతిని పొందినది (26). యుద్ధములో జలంధరుడు సంహరింపబడినవాడు. మాకు వాని వలన భయము తప్పినది. భక్తులను అనుగ్రహించే కైలాసపతి మాపై దయను చూపినాడు (27).


ఆయన ఆజ్ఞచే మేము అందరము నిన్ను శరణు పొందినాము. ఓ దేవీ! నీవు మరియు శంభుడు మీరిద్దరు భక్తులను ఉద్ధరించుటయే ఏకైకధ్యేయముగా గలవారు (28). విష్ణువు బృందయొక్క సౌందర్యముచే ఆకర్షితుడై అచటనే నిలిచియున్నాడు. ఆతడు జ్ఞానభ్రష్టుడై మోహమును పొంది ఆమెయొక్క చితభస్మను ధరించియున్నాడు (29). ఓ మహేశ్వరీ! సిద్ధులు, దేవతాగణములు ఆతనికి బోధించినారు. కాని నీ మాయచే మిక్కిలి మోహితుడై యున్న ఆ హరి జ్ఞానమును పొందుటలేదు (30). ఓ మహాదేవి! దయచూపి విష్ణువునకు బోధించుము. ఆతడు స్వస్థచిత్తుడై తన లోకమును చేరి దేవకార్యమును చేయు విధముగా బోధించుము (31). ఇట్లు స్తుతించుచున్న ఆ దేవతలు ఆకాశమునందు ఆవిర్భవించిన ఒక తేజోరాశిని చూచిరి. ఆ తేజోరాశియొక్క జ్వాలలు దిగంతములకు వ్యాపించెను (32). బ్రహ్మ, ఇంద్రుడు మొదలగు దేవతలందరు ఆ తేజోరాశిమధ్యమునుండి శబ్దమును వినిరి. ఓ వ్యాసా! ఆ ఆకాశవాణి కోర్కెల నీడేర్చునది (33).




సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹





🌹 SRI SIVA MAHA PURANA - 822 🌹


✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj


🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 26 🌴


🌻 The Vanishing of Viṣṇu’s delusion - 4 🌻


24. O great goddess, please carry out our tasks. O Pārvatī, please remove the delusion of Viṣṇu. O goddess Durgā, obeisance be to you.


25-26. O Śivā, when the fight between Jalandhara and Śiva started, for killing Jalandhara, Vṛndā was deluded by Viṣṇu at the bidding of Gaurī. She was made to forsake her virtue and reduced to ashes in the fire. She attained salvation.


27. Jalandhara was slain in the battle by Śiva who took pity on us and who always blesses his devotees. We have been relieved from his fear.


28. It is at his bidding that we all have sought refuge in you. You and Śiva, O goddess, are always engaged in uplifting your devotees.


29. Infatuated by the beauty of Vṛndā, Viṣṇu is staying there itself. He has lost his balance. He is deluded. He has smeared himself with the ashes from her pyre.


30. O great goddess deluded by your illusion, Viṣṇu does not come to his own though advised and consoled by the gods and Siddhas.


31. O great goddess, be merciful. Enlighten Viṣṇu so that he shall return to his region and carry out the task of the gods with a settled mind.


32. Eulogising thus, the gods saw a sphere of refulgence in the sky pervading all the quarters with its flames.


33. O Vyāsa, Brahmā and other gods including Indra heard a celestial voice from the sky bestowing their desire.



Continues....


🌹🌹🌹🌹🌹





1 view0 comments

Comments


bottom of page