top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ శివ మహా పురాణము - 823 / Sri Siva Maha Purana - 823


🌹 . శ్రీ శివ మహా పురాణము - 823 / Sri Siva Maha Purana - 823 🌹


✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 26 🌴


🌻. విష్ణువు యొక్క మోహమును తొలగించుట - 5 🌻


ఆకాశవాణి ఇట్లు పలికెను- నేను మూడు రకముల గుణములచే మూడు రూపములుగా విడివడి యున్నాను. సత్త్వరజస్తమోగుణములచే నేను గౌరి, లక్ష్మి, సరస్వతి అను రూపములను ధరించియున్నాను. ఓ దేవతలారా! (34) మీరు ఆదరముతో వారి వద్దకు వెళ్లుడు. ప్రసన్నులైన వారు నా ఆజ్ఞచే మీ కోరికను నెరవేర్చగలరు (35).


సనత్కుమారుడిట్లు పలికెను- వారా మాటలను విను చుండగనే ఆ తేజస్సు అంతర్హితమయ్యెను. ఓ మునీ! దేవతలు అపుడా తేజస్సును ఆశ్చర్యముతో విప్పారిన నేత్రములతో చూచుచుండిరి (36). అపుడా దేవతలందరూ ఆ వాక్యమును ఆదరముచే విని దానిచే ప్రేరేపించబడినవారై గౌరీలక్ష్మీసరస్వతులను ప్రణమిల్లిరి (37). బ్రహ్మ మొదలగు ఆ దేవతలందరు తలలను వంచి మహాభక్తితో ఆ దేవీమూర్తులను వివిధములగు వాక్కులతో స్తుతించిరి (38). ఓ వ్యాసా! అపుడు వెంటనే ఆ దేవీ మూర్తులు వారి యెదుట ఆవిర్భవించిరి. వారు మహాద్భుతమగు తమ తేజస్సులచే దిగంతము వరకు ప్రకాశింపచేయుచుండిరి (39). అపుడు దేవతలు వారిని గాంచి ప్రసన్నమగు మనస్సు గలవారై వారికి భక్తితో ప్రణమిల్లి స్తుతించి తమ కార్యమును విన్నవించిరి (40). భక్తవాత్సల్యము గల ఆ దేవీ మూర్తులు అపుడు నమస్కరించియున్న దేవతలను గాంచి వారికి బీజములనిచ్చి వారితో సాదరముగా నిట్లనిరి (41).



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹





🌹 SRI SIVA MAHA PURANA - 823 🌹


✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj


🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 26 🌴



🌻 The Vanishing of Viṣṇu’s delusion - 5 🌻



The celestial voice said:—


34. O gods, it is I who stand in three forms by the variety of the three attributes, Rajas, Sattva and Tamas. The three forms are Gaurī, Lakṣmī, and Sarasvatī.


35. Hence you go to them respectfully at my bidding. If they are pleased they will fulfil your desire.



Sanatkumāra said:—


36. Even as the gods were listening to this speech with eyes gaping with wonder, the refulgence vanished.


37. On hearing the speech, the gods, urged by it bowed respectfully to Gaurī, Lakṣmī and Sarasvatī.


38. Brahmā and other gods eulogised the goddesses with various speeches and bowed their heads.


39. Then the goddesses appeared in front of them, suddenly, O Vyasa, illuminating the quarters with their wonderful brilliance.


40. On seeing them, the gods eulogised them with great devotion and delighted minds. They submitted what they wanted to be carried out.


41. Thus bowed and eulogised, the goddesses who are favourably disposed to the devotees, faced the gods and addressed them eagerly after giving them seeds.




Continues....


🌹🌹🌹🌹🌹





1 view0 comments

Comments


bottom of page