top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ శివ మహా పురాణము - 827 / Sri Siva Maha Purana - 827


🌹 . శ్రీ శివ మహా పురాణము - 827 / Sri Siva Maha Purana - 827 🌹


✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 27 🌴


🌻. శంఖచూడుని జననము - 2 🌻


వారిలో ఒకడు మహాబలపరాక్రమశాలి యగు విష్ణుచిత్తుడు. ఆతని పుత్రుడగు దంభుడు ధర్మాత్ముడు, విష్ణుభక్తుడు మరియు ఇంద్రియ జయము గలవాడు (10). ఆతనికి పుత్రసంతానము లేకుండెను. ఆ కారణము వలన ఆ వీరుడు దుఃఖితుడై శుక్రాచార్యుని గురువుగా చేసుకొని కృష్ణమంత్రమును స్వీకరించి (11), పుష్కరతీర్థమునందు లక్ష సంవత్సరములు గొప్ప తపస్సును చేసెను. ఆతడు ఆసనమును దృఢముగా బంధించి చిరకాలము కృష్ణ మంత్రమును మాత్రమే జపించెను (12). తపస్సును చేయుచున్న ఆతని శిరస్సునుండి సహింప శక్యము కానిది, జ్వాలలతో కూడి యున్నది అగు తేజస్సు ఉద్భవించి సర్వత్రా వ్యాపించెను (13). దానిచే పీడితులైన సర్వదేవతలు, మునులు మరియు మనువులు ఇంద్రుని ముందిడుకొని బ్రహ్మను శరణు వేడిరి (14).


దుఃఖితులై యున్న వారు సమస్తసంపదలను ఇచ్చే బ్రహ్మను నమస్కరించి స్తుతించి తమ వృత్తాంతమును విశేషముగా వివరించి చెప్పిరి (15). ఆ వృత్తాంతమును విని బ్రహ్మ వారితో గూడి, అదే వృత్తాంతమును సమమ్రుగా విష్ణువునకు విన్నవించుటకొరకై వైకుంఠమును వెళ్లెను (16). వారందరు అచటకు వెళ్లి ముల్లోకములకు అధిపతి, రక్షకుడు, పరమాత్మయగు విష్ణువునకు ప్రణమల్లి వినయముతో చేతులు కట్టుకొని స్తుతించిరి (17).


సశేషం....



🌹 🌹 🌹 🌹 🌹






🌹 SRI SIVA MAHA PURANA - 827 🌹


✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj


🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 27 🌴


🌻 The birth of Śaṅkhacūḍa - 2 🌻


10. One of them is Vipracitti who was very powerful and valorous. His virtuous son Dambha of self-control was a great devotee of Viṣṇu.


11-12. No son was born to him. Hence the hero became worried. He made the preceptor Śukra his initiator and learnt the mantra of Kṛṣṇa. He performed a great penance in the holy centre Puṣkara[1] for a hundred thousand years. Seating himself in a stable pose he performed the Japa of Kṛṣṇa mantra for a long time.


13. While be was performing the penance, an unbearable refulgence sprang up blazing from his head and spread everywhere.


14. All the gods, sages and Manus were scorched by that. With Indra ahead they sought refuge in Brahmā.


15. Bowing to Brahmā, the bestower of riches, they eulogised him and narrated to him this event.


16. On hearing that, Brahmā accompanied them to Vaikuṇṭha in order to tell the same to Viṣṇu in its entirety.


17. After going there they stood humbly joining their palms in reverence. After bowing to him they eulogised Viṣṇu the lord of the three worlds, the great saviour.



Continues....


🌹🌹🌹🌹🌹




2 views0 comments

Comments


bottom of page