top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ శివ మహా పురాణము - 828 / Sri Siva Maha Purana - 828




🌹 . శ్రీ శివ మహా పురాణము - 828 / Sri Siva Maha Purana - 828 🌹


✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 27 🌴


🌻. శంఖచూడుని జననము - 3 🌻


దేవతలిట్లు పలికిరి - ఓ దేవదేవా! కారణమేమి పుట్టినదో తెలియకున్నది. మేమందరము ఈ బ్రహ్మాండములో తాపమును పొందుచున్నాము. దీనికి కారణమగు తేజస్సు ఏది? చెప్పుము (18). ఓ దీనబంధూ! తాపపీడితమైన మనస్సుగల నీ అనుచరులను నీవు రక్షించెదవు. ఓ రమానాథా! శరణ్యుడవగు నీవు శరణు పొందిన మమ్ములను రక్షింపుము, రక్షింపుము (19).


సనత్కుమారుడిట్లు పలికెను- బ్రహ్మాది దేవతల ఈ మాటలను విని శరణాగతవత్సలుడగు విష్ణువు ప్రేమతో నవ్వి ఇట్లు పలికెను (20).


విష్ణువు ఇట్లు పలికెను- ఓ దేవతలారా! ఆందోళనను విడనాడి పూర్ణస్వస్థతను పొందుడు. భయపడకుడు. జలప్రళయము రాబోవుట లేదు. ఇది ప్రళయసమయము కాదు (21). నా భక్తుడగు దంభుడనే దానవుడు పుత్రుని గోరి తపస్సును చేయుచున్నాడు. ఆతనికి వరమునిచ్చి ఆ తేజస్సును నేను చల్లార్చ గలను (22).


సనత్కుమారుడిట్లు పలికెను - ఓ మునీ! విష్ణువు ఇట్లు పలుకగా బ్రహ్మాది దేవతలందరు ధైర్యమును స్వస్థతను పొంది అన్ని వైపులలో గల తమ తమ స్థానములకు వెళ్లిరి (23). అచ్యుతుడు కూడా దంభుడనే దానవుడు తపస్సు చేయుచున్న పుష్కరమునకు వరమునిచ్చుట కొరకై వెళ్లెను (24).


విష్ణువు అచటకు వెళ్లి తన మంత్రమును జపించుచున్న ఆ భక్తుని మధురమగు వచనములతో ఉత్సాహపరిచి 'వరమును కోరుకొనుము' అని పలికెను (25). ఆతడు తన యెదుట నిలబడియున్న విష్ణువును గాంచి ఆయన పలుకులను విని మహాభక్తితో ప్రణమిల్లి పలుమార్లు స్తుతించెను (26).



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹






🌹 SRI SIVA MAHA PURANA - 828 🌹


✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj


🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 27 🌴


🌻 The birth of Śaṅkhacūḍa - 3 🌻



The gods said'.—


18. “O lord of gods we do not know how this happened to cause this. Please tell us. By what refulgence have all of us been scorched?


19. O friend of the distressed, you are the protector of the distressed and dispirited servants. Save, O lord of Lakṣrnī who are worthy of being sought refuge by us.



Sanatkumāra said:—


20. On hearing these words of Brahmā and other gods, Viṣṇu who is favourably disposed to those who seek refuge, said laughingly and lovingly.



Viṣṇu said:—


21. “O gods, be calm and unperturbed, do not be afraid. No deluge will take place, this is not the time of dissolution.


22. The Asura Dambha a devotee of mine is performing a penance seeking for a son. I shall bestow a boon and quieten him.”



Sanatkumāra said:—


23. O sage, on being consoled thus, Brahmā and other gods became encouraged and they returned to their respective abodes.


24. In order to grant the boon, Viṣṇu went to Puṣkara where Dambha was performing penance.


25. On reaching there Viṣṇu consoled Dambha who was repeating his name and told him the pleasing words—“Mention the boon you wish to be granted.”


26. On hearing his words and seeing Viṣṇu standing in front, the Danava bowed with great devotion and eulogised him again and again.



Continues....


🌹🌹🌹🌹🌹




1 view0 comments

Comments


bottom of page