top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ శివ మహా పురాణము - 831 / Sri Siva Maha Purana - 831



🌹 . శ్రీ శివ మహా పురాణము - 831 / Sri Siva Maha Purana - 831 🌹


✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 28 🌴


🌻. శంఖచూడుని వివాహము - 2 🌻


తపస్సుచే సిద్ధించిన మనోరథము గల ఆ శంఖచూడుడు బ్రహ్మయొక్క ఆజ్ఞచే వెంటనే బదరికాశ్రమమును చేరెను. ఆతని ముఖములో ఆనందము తొణికిసలాడు చుండెను (10). ధర్మధ్వజుని కుమార్తెయగు తులసి తపస్సును చేయుచున్న స్థలమునకు శంఖచూడాసురుడు అనుకోకుండా వచ్చెను (11). మిక్కిలి అందమైనది, అందమగు చిరునవ్వు గలది, శుభకరమగు భూషణములను అలంకరించుకున్నది అగు ఆ యువతి ఆ మహాపురుషుని ప్రేమపూర్వకముగా పరికించెను (12). కోమలమగు దేహము గలది రమ్యమైనది, మంచి శీలము గలది, యగు ఆ యువతిని గాంచి ఆమెను సమీపించి ఆతడు ఆమెతో మధురముగా నిట్లనెను (13).


శంఖచూడుడిట్లు పలికెను- నీ వెవరు? ఎవని కుమార్తెవు ? ఇచ్చట ఉండి నీవేమి చేయుచున్నావు? నీవు మౌనముగా నుంటివేల? నన్ను నీ సేవకునిగా తలపోయుము (14).


సనత్కుమారుడిట్లు పలికెను- ఆతని ఈ మాటలను విని ఆమె ఆతనిని ఉద్దేశించి ప్రేమతో నిట్లనెను (15).


తులసి ఇట్లనెను - నేను ధర్మధ్వజుని కుమార్తెను. తపశ్శాలిని యగు నేను తపోవనములో నుండి తపస్సును చేయుచున్నాను. నీవెవరు? సుఖముగా వెళ్లుము (16). విషముతో పోల్చదగిన స్త్రీజాతి బ్రహ్మాదులనైననూ మోహింపజేయును. నిందార్హురాలు, దోషస్థానము, మోసగత్తే అగు స్త్రీ సాధకులకు సంకెల (17).



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹






🌹 SRI SIVA MAHA PURANA - 831 🌹


✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj


🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 28 🌴


🌻 The penance and marriage of Śaṅkhacūḍa - 2 🌻



10. At the behest of Brahmā, the Dānava whose desire had been achieved through penance went to Badarikāśrama[1] with delight beaming in his face.


11. The Dānava Śaṅkhacūḍa casually visited the place where the daughter of Dharmadhvaja, Tulasī was performing the penance.


12. The smiling beautiful gentle woman fully bedecked in ornaments cast loving glances at the great man.


13. On seeing that charming, tender, beautiful and chaste lady, he stopped near her and spoke to her sweetly.



Śaṅkhacūḍa said:—


14. “Who are you, please? Whose daughter? What are you doing? Why do you stay here and observe silence. Consider me as your devoted slave.”



Sanatkumāra said:


15. On hearing these words she spoke to him lovingly.



Tulasī said:—


16. I am the daughter of Dharmadhvaja. I am performing penance. I stay in this hermitage. Who are you? You can go as you please.


17. The entire class of women is fascinating. It enchants even Brahmā, not to speak of others. It is censurable, poisonous and deceptive. It is illusion and a fetter to the devout and the faithful.



Continues....


🌹🌹🌹🌹🌹




1 view0 comments

Yorumlar


bottom of page