🌹 . శ్రీ శివ మహా పురాణము - 832 / Sri Siva Maha Purana - 832 🌹
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 28 🌴
🌻. శంఖచూడుని వివాహము - 3 🌻
సనత్కుమారుడిట్లు పలికెను- తులసి ఆతనితో ప్రేమపూర్వకముగా ఇట్లు పలికి విరమించెను. ఆతడు చిరునవ్వుతో గూడియున్న ఆమెను గాంచి ఇట్లు చెప్పుటకు ఉపక్రమించెను (18).
శంఖచూడుడు ఇట్లు పలికెను - ఓ దేవీ! నీవు చెప్పిన సర్వము అసత్యము కాదు. కాని కొంత సత్యము, కొంత అసత్యము గలదు. నా మాటను వినుము (19). పతివ్రతాస్త్రీలలో నీవు అగ్రేసరురాలవు. నేను పాపదృష్టిగల కాముకుడును గాను. నీవు కూడ అట్టి దానవు కాదని నేను భావించుచున్నాను (20). ఇపుడు నేను బ్రహ్మ యొక్క ఆజ్ఞచే నీవద్దకు వచ్చియుంటిని. ఓ సుందరీ! నేను నిన్ను గాంధర్వివిధిలో వివాహమాడెదను (21). దేవతలు పారిపోవునట్లు చేయు శంఖచూడుడను నేను. ఓ మంగళస్వరూపురాలా! నన్ను ఎరుంగనా ! ఎప్పుడైననూ నా పేరు వినలేదా? (22). విశేషించి నేను దనువంశములో జన్మించితిని. నా తండ్రి పేరు దంభుడు. పూర్వజన్మలో నేను శ్రీకృష్ణుని అనుంగు సహచరుడైన సుదాముడనే గోపాలకుడను (23) రాధాదేవియొక్క శాపముచే ఈ జన్మలో దానవవీరుడనై జన్మించితిని. శ్రీకృష్ణుని ప్రభావముచే నేను పూర్వ జన్మ వృత్తాంతమునంతనూ ఎరుంగుదును (24).
సనత్కుమారుడిట్లు పలికెను - శంఖచూడుడు ఆమె ఎదుట ఇట్లు పలికి విరమించెను. ఆ రాక్షసరాజు ఇట్లు ఆదరముతో సత్యవచనమును పలుకగా, ఆ తులసి సంతసించి చిరునవ్వుతో ఇట్లు చెప్పుట మొదలిడెను (25).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 832 🌹
✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 28 🌴
🌻 The penance and marriage of Śaṅkhacūḍa - 3 🌻
Sanatkumāra said:—
18. Tulasī thus spoke to the passionate Dambha and stopped. On seeing her smiling he began to say.
Śaṅkhacūḍa said:—
19. O gentle lady, what you said now is not entirely false. It is partially true also. Now listen to me.
20. You are the foremost among chaste ladies. I am not a lusty person of sinful nature. I think you too are not like that.
21. I come to you now at the behest of Brahmā. O gently lady, I shall take your hand by the Gāndharva rites of marriage.
22. I am Śaṅkhacūḍa, the router of the gods. O gentle lady, don’t you know me? Have I never been heard by you?
23. I am a scion of the family of Danu. I am a Dānava, the son of Dambha. In the previous birth I was the cowherd Sudāmā, a comrade of Kṛṣṇa.
24. Due to the curse of Rādhā I have become a Dānava now. By the favour of Kṛṣṇa I remember events of previous birth. I know everything.
Sanatkumāra said:—
25. After saying thus to her, Śaṅkhacūḍa stopped. Tulasī who was thus addressed truthfully and respectfully by the king of Dānavas, was delighted and she spoke smilingly.
Continues....
🌹🌹🌹🌹🌹
Comments