top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ శివ మహా పురాణము - 836 / Sri Siva Maha Purana - 836

🌹 . శ్రీ శివ మహా పురాణము - 836 / Sri Siva Maha Purana - 836 🌹


✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 29 🌴


🌻. శంఖచూడుని పూర్వజన్మ వృత్తాంతము - 2 🌻


ఆ రాక్షసరాజు వారిచే సేవింపబడుతూ వెళ్లుచున్నవాడై నక్షత్రముల మధ్య చంద్రుని వలె, గ్రహముల మధ్య సూర్యునివలె ప్రకాశించెను (11). స్వర్గాధిపతియగు ఇంద్రుడు శంఖచూడుని రాకను గూర్చి విని దేవతలందరితో గూడి అతనితో యుద్ధమును చేయుటకు సన్నద్ధుడాయెను (12). అపుడు దేవతలకు రాక్షసులకు మధ్య వీరులకు ఆనందమును కలిగించునది, పరాక్రమవిహీనులకు భయమును గొల్పునది, గగర్పాటు కలిగించునది, అద్భుతమైనది అగు యుద్ధము జరిగెను (13). యుద్ధములో వీరులు గర్జించుటచే పెద్ద కోలాహలము చెలరేగెను. మరియు అచట పరాక్రమమును వర్ధిల్లజేయు వాద్యముల ధ్వని చేయబడెను (14).


అధిక బలశాలురగు దేవతలు కోపించి రాక్షసులతో యుద్ధమును చేసిరి.రాక్షసులు పరాజయమును పొంది భయముతో పరుగెత్తిరి (15). సమర్థుడగు శంఖచూడుడు వారు పారిపోవుచుండుటను గాంచి సింహనాదమును చేసి స్వయముగా దేవతలతో యుద్ధమును చేసెను (16). ఆతడు వెంటనే వేగముగా దేవతలపై విరుచుకుపడగా, ఆతని గొప్ప తేజస్సును సహింపజాలక దేవతలందరు పరుగులెత్తిరి (17) కొండగుహలలో, మరియు ఇతరస్థలములలో ఎచటనో ఉన్నవారై దీనులగు దేవతలు ఆతనికి వశులై స్వాతంత్రమును గోల్పోయి గడ్డకట్టిన సముద్రమువలె కాంతి విహీనులైరి (18). దంభుని పుత్రుడు, శూరుడు, ప్రతాపశీలియగు ఆ రాక్షసరాజు కూడ సర్వలోకములను జయించి దేవతల అధికారములను లాగుకొనెను (19). ఆతడు ముల్లోకములను తన వశము చేసుకొని యజ్ఞభాగములను పూర్తిగా తానే స్వీకరించి తానే ఇంద్రుడై జగత్తు నంతనూ పాలించెను (20). ఆతడు కుబేర, చంద్ర, సూర్య, అగ్ని, యమ, వాయువుల అధికారములను తన శక్తిచే నిర్వహించెను (21).



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹





🌹 SRI SIVA MAHA PURANA - 836 🌹


✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj


🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 29 🌴


🌻 The previous birth of Śaṅkhacūḍa - 2 🌻


11. The leader of the Dānavas going in the midst of his attendants shone as the moon in the midst of stars or as the sun in the midst of planets.


12. On hearing that Śaṅkhacūḍa was coming, Indra the king of heaven, accompanied by the gods made preparations for a fight.


13. Then a tremendous fight ensued between the Asuras and the gods delighting the heroic and terrifying the cowardly. It caused hairs to stand on end.


14. When the warriors roared in the battle, there was a tumultuous noise. The sound of drums and other instruments encouraged the warriors.


15. The powerful gods fought with the Asuras ferociously and defeated them. They were afraid and fled.


16. On seeing them fleeing, their leader Śaṅkhacūḍa roared like a lion and fought with the gods.


17. With his power and force he distressed the gods. The gods could not endure his dazzling brilliance. They fled.


18. The gods thus vanquished took shelter in the caves of the mountains. They lost their independence. They were subjugated. They lost their lustre like the frozen sea.


19. Thus the son of Dambha, the valorous leader of the Dānavas, conquered all the worlds and took up the powers of the gods.


20. He kept the three worlds under his control. He partook of all the shares in sacrifices. He became Indra and ruled the universe.


21. He carried the tasks of Kubera, Moon, Sun, Fire, Yama and Vāyu, according to his ability.



Continues....


🌹🌹🌹🌹🌹




0 views0 comments

Comments


bottom of page