🌹 . శ్రీ శివ మహా పురాణము - 840 / Sri Siva Maha Purana - 840 🌹
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 29 🌴
🌻. శంఖచూడుని పూర్వజన్మ వృత్తాంతము - 6 🌻
ఓ బ్రహ్మా! సత్త్వరజస్తమో గుణ ప్రధానులై క్రమముగా సృష్టిస్థితిలయములను చేయు బ్రహ్మవిష్ణు హరులనే త్రిమూర్తులు ఆయన దేహమునుండి పుట్టినవారే (49). ఆయనయే పరమాత్మ నిత్య, అనిత్యవస్తువులను కల్పించే ఆయన మాయా సంబంధము లేని వాడై ఉమాదేవితో గూడి విహరించుచున్నాడు (50). ఆ శివలోకమునకు సమీపములో గోలోకము, శంకరుని గోశాల గలవు. నా అవతారమగు శ్రీకృష్ణుడు శంకరుని ఇచ్ఛచే ఆ గోలోకమునందు నివసించుచున్నాడు (51).
శివుడు శ్రీకృష్ణుని తన గోవుల రక్షణ కొరక నియోగించెను. శ్రీ కృష్ణుడు శివుని నుండి లభించిన సుఖమును అనుభవిస్తూ అచట సర్వదా క్రీడించుచుండును. ఆయన విహారకుశలుడు (52). జగన్మాత, ప్రకృతి కంటే ఉత్కృష్టమైన స్వరూపము గల అయిదవ మూర్తి, విహారప్రియురాలు అగు రాధ ఆతని ప్రియురాలు అని చెప్పబడినది (53). ఆమె నుండి జన్మించిన గోపాలకులు, గోపికలు చాలమంది అచట రాధాకృష్ణులను సేవిస్తూ నిత్యము చక్కని విహారమునందు నిమగ్నులే యుందురు (54). ఆ సుదాముడు శంభుని లీలచే రాధాదేవిని చూచి మోహితుడయ్యెను ఆమె శపించగా ఆతడు తనకు దుఃఖమును కలుగజేసే దానవరూపమును వ్యర్థముగా పొందియున్నాడు (55). ఆతడు రుద్రుని శూలముచే వధింపబడునని పూర్వము శ్రీకృష్ణుడు నిర్ణయించి యున్నాడు. ఆతడు తన దేహమును విడిచిన పిదప శ్రీకృష్ణుని అనుచరుడు కాగలడు (56). ఓ ఇంద్రా! ఈ సత్యము నెరింగి భయమును విడనాడుము. మనము శంకరుని శరణు జొచ్చెదము. ఆయన వెంటనే మంగళమును చేయగలడు (57). నేను, నీవు, మరియు సర్వదేవతలు భయమును విడి ఇచట నున్నాము (58).
సనత్కుమారుడిట్లు పలికెను - ఇట్లు పలికి విష్ణువు బ్రహ్మతో గూడి సర్వేశ్వరుడు, భక్త వత్సలుడునగు శంభుని మనస్సులో స్మరిస్తూ శివలోకమునకు వెళ్లెను (59).
శ్రీ శివ మహా పురాణములోని రుద్ర సంహితయందు యుద్ధఖండములో శంఖచూడ పూర్వభవవృత్త వర్ణనమనే ఇరువది తొమ్మిదవ ఆధ్యాయము ముగిసినది (29).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 840 🌹
✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 29 🌴
🌻 The previous birth of Śaṅkhacūḍa - 6 🌻
49, 50. O Brahmā, the three deities bringing about creation etc. are born of him.[3] They are Viṣṇu, Brahmā and Śiva endowed with Śāttvika and other attributes. He alone is the supreme soul. He sports there with Pārvatī. He is free from illusion. He is the formulator of the eternal and the non-eternal.
51. The Goloka is near it. Śiva’s cowshed is situated there. Kṛṣṇa having my form stays there at Śiva’s behest.
52. It is to tend his cows and bulls that he has been ordered by him. Deriving happiness from him he too sports there.
53. His wife Rādhā[4] is the mother of the universe. Her form is greater than Prakṛti. It is the fifth[5] sportive form.
54. Many cowherds and cowherdesses born of her live there. They are sportively inclined and follow Rādhā and Kṛṣṇa.
55. That very same (Sudāmā, now born as Śaṅkhacūḍa) has been fascinated by her by Śiva’s illusion. Cursed by Rādhā he is born as a Dānava to his distress.
56. Kṛṣṇa has already ordained that the death of Śaṅkhacūḍa will be by Rudra’s trident. Casting off his body he will become his comrade again.
57. O lord of gods, knowing this you need not have any fear. Let us seek refuge in Śiva. He will do everything conducive to our good.
58. You, I and the gods stand here fearless (due to that only).
Sanatkumāra said:—
59. After saying this and mentally thinking upon Śiva who, the lord of all, is favourably disposed to his devotees Viṣṇu went to Śivaloka accompanied by Brahmā.
Continues....
🌹🌹🌹🌹🌹
Commentaires