top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ శివ మహా పురాణము - 841 / Sri Siva Maha Purana - 841



🌹 . శ్రీ శివ మహా పురాణము - 841 / Sri Siva Maha Purana - 841 🌹


✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 30 🌴


🌻. దేవదేవ స్తుతి - 1 🌻


సనత్కుమారుడిట్లు పలికెను - ఓ వ్యాసా! లక్ష్మీ పతి అదే సమయములో బ్రహ్మతో కలిసి మహాదివ్యమైనది, ఆధారము లేనిది, భూత నిర్మితము కానిది యగు శివలోకమునకు వెళ్లి (1), ఆనందముతో గూడిన ముఖము గలవాడై లోపలికి వెళ్లెను. విష్ణువు అనేక రత్నములు పొదుగుటచే మిరిమిట్లు గొల్పుతూ మెరియుచున్నది (2), రంగురంగులది, గణములచే సేవింపబడుచున్నది, గొప్ప కాంతితో శోభిల్లునది, చాల పెద్దది, మిక్కిలి సుందరమైనది అగు మొదటి ద్వారమును గాంచెను (3). రత్నసింహాసనములయందు కూర్చున్నవారు, తెల్లని వస్త్రములతో ప్రకాశించుచున్నవారు, రత్నభూషణములతో అలంకరింపబడిన వారు, అయిదు ముఖములు మూడు కన్నులు గలవారు, పచ్చని అందమగు దేహములు గలవారు, త్రిశూలమును మొదలగు ఆయుధములను దాల్చిన వీరులు, మరియు భస్మతో రుద్రాక్షలతో ప్రకాశించువారు అగు ద్వారపాలకులను కూడ గాంచెను (4, 5). లక్ష్మీపతి బ్రహ్మతో సహా వినమ్రతతో వారికి ప్రణమిల్లి ప్రభుడగు శివుని దర్శించదగిన పని గలదని చెప్పెను (6). అపుడు వారు ఆతనికి అనుజ్ఞనీయగా, ఆతడు మిక్కిలి సుందరమైనది, రంగురంగులది, గొప్ప కాంతులను వెదజల్లునది అగు ఆ గొప్ప ద్వారము లోపలకు ప్రవేశించెను (7).


అచట మరియొక ద్వారపాలకునకు కూడ తాను ప్రభువు వద్దకు వెళ్లవలసిన కారణము గలదని విష్ణువు విన్నవించి ఆతని అనుమతిని బడసి ఆ ద్వారము లోపల ప్రవెశించెను (8). బ్రహ్మ ఈ విధముగా పదిహేను ద్వారములను దాటి మహాద్వారమును చేరి అచట నందిని గాంచెను (9).



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹





🌹 SRI SIVA MAHA PURANA - 841 🌹


✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj


🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 30 🌴


🌻 Prayer to the lord of gods - 1 🌻



Sanatkumāra said: —


1-2. O Vyāsa, starting then itself along with Brahmā, Viṣṇu, the lord of Lakṣmī, went to Śivaloka, highly divine, propless and unearthly. He was glad and his face beamed with pleasure. The region was strewn over with many gems. It was highly brilliant.


3-4. The first entrance was of variegated nature with many Gaṇas standing there. It was resplendent, lofty and and beautiful. After reaching it he saw the gatekeepers seated on gem-set thrones. They had gem-set ornaments and white garments.


5. They had five faces, three eyes and fair handsome bodies. They were trident-bearing heroes shining with Bhasma and Rudrākṣa.


6. Both Brahmā and Viṣṇu bowed to them humbly and told them that they wanted to see the lord.


7. They permitted them to enter. They saw another door very beautiful, variegated and very brilliant.


8. They informed the gatekeeper of their desire to approach the lord. Permitted by them they entered and saw another door.


9. Thus Brahmā entered through fifteen doors and reached the main threshold. He saw Nandin.



Continues....


🌹🌹🌹🌹🌹




1 view0 comments

Коментарі


bottom of page