🌹 . శ్రీ శివ మహా పురాణము - 842 / Sri Siva Maha Purana - 842 🌹
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 30 🌴
🌻. దేవదేవ స్తుతి - 2 🌻
విష్ణువు పూర్వము నందు వలె ఆ నందిని చక్కగా స్తుతించి నమస్కరించి ఆతని అనుమతిని పొంది ఆనందముతో మెల్లగా లోపలకు ప్రవేశించెను (10). అచటకు వెళ్లి అచట గొప్ప శోభ గలది, ఎత్తైనది, ప్రకాశించే దేహములు గల గణములతో చుట్టు వారబడి యున్నది, చక్కగా అలంకరింపబడినది అగు ఆ శంభుని సభను గాంచెను (11). మహేశ్వరుని రూపముగల ఆ గణములు పది భుజములతో, అయిదు ముఖములతో, మూడు కన్నులతో నల్లని కంఠములతో ప్రకాశించిరి. వారు దివ్యకాంతులతో ఒప్పారుచుండిరి (12). వారు మంచి రత్నములు పొదిగిన ఆభరణములను రుద్రాక్షలను అలంకరించుకొని భస్మను ధరించి యుండిరి. చతురస్రాకారముతో మనోహరముగా నున్న ఆ సభ నూతన చంద్రమండలము వలె శోభిల్లెను (13). మణులు, వజ్రములు పొదిగిన హారములతో ఆ సభ శోభిల్లెను. విలువ కట్టలేని రత్నములు పొదిగియున్న ఆ సభ పద్మపత్రములతో శోభిల్లుచుండెను (14).
మాణిక్యముల తోరణములు కలిగినది, రంగురంగుల కాంతులను విరజిమ్మునది, పద్మరాగ ఇంద్రనీల మణులతో అద్భుతముగా శంకరుని ఇచ్ఛకు అనురూపముగా నిర్మింపబడినది (15), స్యమంతకమణులు పొదిగినవి. బంగరు త్రాళ్లతో కట్టబడినవి, సుందరమగు చందననిర్మితమైన లతాపల్లవాదులతో శోభిల్లునవియగు వందమెట్లు కలిగినది (16), ఇంద్రనీల మణులు స్తంభములతో చుట్టువారబడి మిక్కిలి మనోహరముగా నున్నది, అంతటా చక్కగా అలంకరింప బడినది, పరిమళ భరితమగు వాయువుచే నిండి యున్నది (17), వేయి యోజనముల వెడల్పు గలది, అనేక మంది కింకరులతో నిండియున్నది అగు సభలో జగన్మాతతో గూడి యున్న శంకరుని దేవదేవుడగు విష్ణువు గాంచెను (18).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 842 🌹
✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 30 🌴
🌻 Prayer to the lord of gods - 2 🌻
10. After bowing to and eulogising Nandin as Brahmā did before, Viṣṇu was permitted by Nandin and he entered joyously.
11. Going in, they saw the grand assembly chamber of Śiva, highly decorated and thronged by his attendants with lustrous bodies.
12. The attendants had similar forms with lord Śiva. They had ten arms, five faces, three eyes and blue necks. They had auspicious lustre and were brilliant.
13. They were bedecked in ornaments set with gems, They wore Rudrākṣas. They had smeared themselves with the ashes. The chamber was square in shape and beautiful like the lunar sphere.
14. Gems, necklaces, diamonds, etc. increased its brilliance. Valuable precious stones were used to stud them. It was brightened by lotus petals.
15. Māṇikya, Padmarāga and other valuable gems were used in the same. It was very wonderful. It was laid according to the desire of Śiva.
16. It had hundreds of steps leading to it, each made of Syamantaka stone; knotted golden threads joined them. Beautiful sprouts of sandal beautified it.
17. Columns of sapphire supported it. It was richly decorated. The wind wafted fragrance everywhere.
18. The chamber was a thousand Yojanas wide. Many servants were in attendance. Viṣṇu the lord of gods saw Śiva seated along with Pārvatī.
Continues....
🌹🌹🌹🌹🌹
Comments