top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ శివ మహా పురాణము - 843 / Sri Siva Maha Purana - 843




🌹 . శ్రీ శివ మహా పురాణము - 843 / Sri Siva Maha Purana - 843 🌹


✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 30 🌴


🌻. దేవదేవ స్తుతి - 3 🌻


సభామధ్యములో అమూల్యమగు రత్నములచే నిర్మింపబడిన వివిధవర్ణముల సింహాసనమునందు కూర్చుండి చుక్కలతో చుట్టువారు బడియున్న చందురునివలె శోభిల్లువాడు (19), కిరీట కుండల రత్నమాలలచే అలంకరింపబడినవాడు, భస్మలేపనము గల సర్వావయవములు గలవాడు, విలాసము కొరకై పద్మమును పట్టుకున్న వాడు (20), ఎదుట ప్రదర్శింపబడు చున్న గానసహిత నాట్యమును ఆనందపూర్వకముగా చిరునవ్వుతో తిలకించు చున్నవాడు అగు శివుని గాంచెను (21).


శాంతుడు, ప్రసన్నమగు మనస్సు గలవాడు, పార్వతీపతి, గొప్ప ప్రకాశము గలవాడు, దేవిచే ఈయబడిన సుగంధ తాంబూలమును నములుచున్నవాడు (22), తెల్లని వింజామరలతో గణములచే సేవింప బడుచున్నవాడు, భక్తితో నమ్రమైన శిరస్సులు గల సిద్ధులచే స్తుతింపబడుచున్నవాడు (23), త్రిగుణములకు అతీతుడు, పరమేశ్వరుడు, త్రిమూర్తులకు తండ్రి, సర్వవ్యాపకుడు, భేదరహితుడు, ఆకారము లేని వాడు, యథేచ్ఛగా ఆకారమును స్వీకరించువాడు (24), మాయాసంగము లేనివాడు, పుట్టుక లేనివాడు, సర్వకారణుడు, మాయను వశము చేసుకున్నవాడు, పరాత్పరుడు, ప్రకృతి పురుషులకు అతీతమైనవాడు, నిత్యస్వరాట్‌ (25), పరిపూర్ణ తముడు, సర్వమునందు సమముగా నుండువాడు అగు శివుని గాంచి బ్రహ్మవిష్ణువులు చేతులు జోడించి నమస్కరించి స్తుతించిరి (26).



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹





🌹 SRI SIVA MAHA PURANA - 843 🌹


✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj


🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 30 🌴


🌻 Prayer to the lord of gods - 3 🌻


19. Śiva was in the midst of his attendants like the moon surrounded by stars. He was seated in a variegated throne set with valuable gems.


20. He had a crown on his head, earrings in his ears. He was embellished with gem necklaces. Ashes were smeared all over his body. He held a toy lotus.


21. He was smilingly watching the song and dance going on in front of him.


22. He was calm and delighted in the mind. He was highly brilliant. He was chewing the fragrant betel leaves offered by the goddess.


23. He was attended upon by Gaṇas with white chowries and eulogised by Siddhas with stooping shoulders with great devotion.


24-25. The great lord Śiva, the progenitor of the three deities, the lord beyond the reach of attributes, who assumes and discords his forms as he pleases and is invariable, who is free from illusion, unborn, the primordial being, the lord of illusion, greater than the greatest and greater than the Prakṛti and Puruṣa.


26. On seeing Śiva of perfect features, Viṣṇu and Brahmā eulogised him together after bowing to him with palms joined in reverence.



Continues....


🌹🌹🌹🌹🌹





1 view0 comments

Comments


bottom of page