🌹 . శ్రీ శివ మహా పురాణము - 844 / Sri Siva Maha Purana - 844 🌹
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 30 🌴
🌻. దేవదేవ స్తుతి - 4 🌻
బ్రహ్మవిష్ణువులిట్లు పలికిరి- ఓ దేవదేవా! మహాదేవా! పరబ్రహ్మా! సర్వేశ్వరా! సత్త్వరజస్తమో గుణములకు అతీతమైనవాడా! ఆనందస్వరూపా! త్రిమూర్తుల తండ్రీ! ప్రభూ! (27). మేము నిన్ను శరణు పొందుచున్నాము. ఓ విభూ! పరమేశ్వరా! శంఖచూడునిచే పీడింపబడి క్లేశములను పొంది దుఃఖితులమై యున్నాము. సత్స్వరూపుడవగు నీవే మాకు నాథుడవు. మమ్ములను రక్షింపుము (28). ఇచటకు సమీపములో నున్న లోకమునకు గోలోకమని పేరు. దానికి శ్రీకృష్ణభగవానుడు అధీశ్వరుడు. ఆయనకు నీవు ప్రభుడవు (29). శ్రీకృష్ణుని అనుంగు సహచరుడగు సుదాముడు దైవవశముచే రాధచే శపింపబడి శంఖచూడుడనే దానవుడైనాడు (30). ఓ శంభూ! ఆతడు దేవతలను పరిపరి విధముల బాధలకు గురిచేసి స్వర్గమునుండి వెళ్లగొట్టినాడు. తమ అధికారములను పోగొట్టుకొనిన దేవతలు భూలోకములో తిరుగాడుచున్నారు (31). ఆతనిని దేవతలందరిలో ఒక్క రైననూ సంహరింపజాలరు. నీవు మాత్రమే ఆతనిని సంహరించగలవు. ఓ మహేశ్వరా! నీవాతనిని వధించి లోకములకు సుఖమును కలుగజేయుము (32). నిర్గుణుడు, సత్యస్వరూపుడు, అనంతుడు, అంతములేని పరాక్రమము గలవాడు, సగుణుడు, సత్పురుషులకు ఆశ్రయమైనవాడు, ప్రకృతిపురుషులకు అతీతుడు అగు పరమాత్మ నీవే (33).
ఓ ప్రభూ! సృష్టి కాలములో నీవు రజోగుణప్రధానుడవై బ్రహ్మరూపములో సృష్టిని చేసెదవు. విష్ణురూపములో సత్త్వగుణప్రధానుడవై ముల్లోకములను రక్షించెదవు (34). తమో గుణప్రధానుడవై రుద్రరూపములో ప్రళయకాలము నందు జగత్తును నాశము చేసెదవు. త్రిగుణా తీతమగు తురీయ శుద్ధచైతన్య స్వరూపుడవై శివనామముతో ప్రసిద్ధిని గాంచి యున్నావు (35).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 844 🌹
✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 30 🌴
🌻 Prayer to the lord of gods - 4 🌻
Viṣṇu and Brahmā said: —
27. O lord Śiva, lord of the gods, O supreme Brahman, lord of all. O quiet one that is beyond the three attributes, O lord progenitor of the three deities.
28. We have sought refuge in you. O lord, save us who are distressed. O lord Śiva, we are harassed by Śaṅkhacūḍa and so dejected and well nigh exhausted. Save us.
29. The region that is adjacent to this place is called Goloka, Lord Kṛṣṇa is its presiding deity.
30. One of his leading attendants and comrades, Sudāmā, cursed by Rādhā and led by fate, has become the Dānava Śaṅkhacūḍa.
31. O Śiva, the gods divested of all powers ousted and harassed by him roam over the Earth now.
32. Except by you he cannot be killed by any one of the gods. Please kill him and render the worlds happy.
33. You alone are devoid as well as possessed of attributes, truthful, of infinite valour, embedded in the good and greater than Prakṛti and Puruṣa.
34. At creation, O lord, you are Brahmā, the creator through Rajas. O protector of the three worlds, in the activity of protection through Sattva you are Viṣṇu.
35. In dissolution through Tamas you are Rudra the annihilator of the universe. In the state free from the three attributes you are Śiva the fourth one, of the form of brilliance.
Continues....
🌹🌹🌹🌹🌹
Comments