🌹 . శ్రీ శివ మహా పురాణము - 845 / Sri Siva Maha Purana - 845 🌹
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 30 🌴
🌻. దేవదేవ స్తుతి - 5 🌻
ఓ ప్రభూ! సృష్టి కాలములో నీవు రజోగుణప్రధానుడవై బ్రహ్మరూపములో సృష్టిని చేసెదవు. విష్ణురూపములో సత్త్వగుణ ప్రధానుడవై ముల్లోకములను రక్షించెదవు (34). తమో గుణప్రధానుడవై రుద్రరూపములో ప్రళయకాలము నందు జగత్తును నాశము చేసెదవు. త్రిగుణా తీతమగు తురీయ శుద్ధచైతన్య స్వరూపుడవై శివనామముతో ప్రసిద్ధిని గాంచి యున్నావు (35). శ్రీకృష్ణుడు నీ ఆజ్ఞచే నీ గోవులను రక్షిస్తూ గోలోకములో నీ గోశాల మధ్యలో నున్న వాడై రాత్రింబగళ్లు క్రీడించుచున్నాడు (36). సర్వమునకు కారణము మరియు ప్రభువు నీవే. బ్రహ్మ విష్ణురుద్రరూపములలో నున్న నిర్వికార పరబ్రహ్మవు నీవే. నిత్యసాక్షియగు పరమాత్మ నీవే. నీవు ఈశ్వరులకు ఈశ్వరుడవు (37). దీనులకు అనాథులకు సాహాయ్యకారియై వారిని పాలించు దీన బంధువు నీవు. త్రిలోకాధిపతివి అగు నీవు శరణుజొచ్చిన వారియందు వాత్సల్యమును చూపెదవు (38). ఓ గౌరీపతీ! పరమేశ్వరా! మమ్ముల నుద్ధరించుము. ప్రసన్నుడవు కమ్ము. ఓ నాథా! మేము నీ ఆధీనములో నున్నాము. నీకు ఎట్లు ఇష్టమైనచో, అటులనే చేయుము (39).
ఓ వ్యాసా! బ్రహ్మ విష్ణువులనే ఆ దేవతలిద్దరు అపుడిట్లు పలికి వినయముతో చేతులు జోడించి శివునకు నమస్కరించి విరమించిరి (40).
శ్రీ శివ మహా పురాణములోని రుద్ర సంహితయందు యుద్ధఖండలో దేవదేవస్తుతియను ముప్పదియవ ఆధ్యాయము ముగిసినది (30).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 845 🌹
✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 30 🌴
🌻 Prayer to the lord of gods - 5 🌻
34. At creation, O lord, you are Brahmā, the creator through Rajas. O protector of the three worlds, in the activity of protection through Sattva you are Viṣṇu.
35. In dissolution through Tamas you are Rudra the annihilator of the universe. In the state free from the three attributes you are Śiva the fourth one, of the form of brilliance.
36. At your behest, Kṛṣṇa the protector, goes to Goloka. Stationed in the middle of your cowshed he sports day and night.
37. You are the cause of all. You are the lord of all. You are Brahmā, Viṣṇu and Śiva. You are free from aberrations. You are the constant witness. You are the supreme soul, the great Īśvara.
38. You are the redeemer of the distressed and the poor, the protector and the kinsman of the distressed, the lord of the worlds. You are favourably disposed to those who seek refuge in you.
39. O lord of Pārvatī, uplift us. O lord Śiva, be pleased. O lord, we are subservient to you. You do as you please, O lord.
Sanatkumāra said:—
40. After saying this, O Vyāsa, those two deities, Viṣṇu and Brahmā bowed to Śiva and stopped. They joined their palms in reverence and stood humbly.
Continues....
🌹🌹🌹🌹🌹
Comments