top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ శివ మహా పురాణము - 847 / Sri Siva Maha Purana - 847

🌹 . శ్రీ శివ మహా పురాణము - 847 / Sri Siva Maha Purana - 847 🌹


✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 31 🌴


🌻.బ్రహ్మవిష్ణువులకు శివుని ఉపదేశము - 2 🌻


వారు సిగ్గుతో కలవరపడిన మనస్సు గలవారై నా ఎదుట దైన్యముతో వృత్తాంతమునంతనూ చెప్పి 'రక్షింపుము, రక్షింపుము' అని పలికిరి (9). అపుడు భవుడనగు నేను సంతసిల్లి వారితో నిట్లంటిని ; ఓ కృష్ణా! మీరందరు నా ఆజ్ఞచే భయమును విడనాడుడు (10). నేను సర్వదా ప్రేమతో మిమ్ములను రక్షించెదను. మీకు మంచి మంగళము కలుగ గలదు. ఇది అంతయూ నా ఇచ్ఛచేతనే జరిగినది. సందేహము లేదు (11). నీవు రాధతో మరియు నీ అనుచరునితో గూడి నీ స్థానమునకు వెళ్లుము. ఈతడు భారతదేశములో దానవుడై జన్మించును గాక! దీనిలో సంశయము లేదు (12).


నేను సమయము వచ్చినపుడు మిమ్ములనిద్దరినీ శాపమునుండి ఉద్ధరించెదను. నా ఈ మాటను రాధాకృష్ణులిద్దరు శిరసా వహించిరి (13). బుద్ధిమంతుడగు శ్రీకృష్ణుడు చాల సంతసించి తన స్థానమునకు వెళ్లెను. వారిద్దరు భయపడుతూ నా ఆరాధనయందు నిష్ఠ గలవారై అచటనే మకాము చేసిరి (14). సర్వము నా ఆధీనములో నున్నదనియు, తమకు స్వాతంత్ర్యము లేదనియు వారు గుర్తించిరి. ఆ సుదాముడు రాధయొక్క శాపముచే దానవవీరుడై జన్మించెను (15). ధర్మవివేకము గల ఆ దానవుడు శంఖచూడుడను పేర ప్రసిద్ధిని గాంచి దేవతలకు ద్రోహమును తలపెట్టినాడు. ఆ దుష్టుడు దేవగణములనన్నింటినీ సర్వదా బలాత్కారముగా కష్టములకు గురిచేయుచున్నాడు (16). నా మాయచే మిక్కిలి మోహితుడై యున్న ఆ శంఖచూడునకు దుష్టులగు మంత్రులు తోడగుచున్నారు. మీరు వెనువెంటనే భయమును విడనాడుడు. నేను రక్షకుడను ఉన్నాను గదా! (17)



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹





🌹 SRI SIVA MAHA PURANA - 847 🌹


✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj


🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 31 🌴


🌻 Śiva’s advice to Viṣṇu and Brahmā - 2 🌻


9. Overwhelmed by shame they told me all the details. Dejected, they lamented before me saying the words “Save us, O save us.”


10. Then I, becoming delighted, told them these words, Kṛṣṇa, you forget your fear at my behest.


11. I am the protector, always infused with love. Good will befall you. All this has happened at my will. There is no doubt in it.


12. Go to your abode along with Rādhā and your comrade. He will become a Dānava here in Bhārata, certainly.


13-14. At the proper time I shall redeem you from the curse”. What I told thus Śrīkṛṣṇa and Rādhā accepted readily. Śrīkṛṣṇa the intelligent rejoiced and returned to his abode. There they engaged themselves in propitiating me and bidding their time.


15. Realising that everything is subject to my control and his will is not independent, Sudāmā became the lord of Dānavas as a result of the curse of Rādhā.


16. The virtuous demon Śaṅkhacūḍa distresses and harasses the gods always with his might. He is evil-minded to this extent.


17. He has been deluded by my deception and hence he seeks the help of evil ministers. But myself being the chastiser of the wicked you can get rid of his fear quickly”.



Continues....


🌹🌹🌹🌹🌹




1 view0 comments

Comments


bottom of page